దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఒకరు, తాజాగా మణి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ చిత్రం`నవాబ్` తమిళనాట ఘన విజయం సాధించింది. టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబడుతోంది.
ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మణిరత్నం.మైలాపూర్ లోని కేశవ పెరుమాల్ కోవిల్ వీధిలో ఉన్న మణిరత్నం ఆఫీస్ను బాంబులతో పేల్చేస్తామంటూ ఆ వ్యక్తి ఫోన్ లో సోమవారం రాత్రి బెదించినట్టుగా మణి ఆఫీసు సిబ్బంది వెల్లడించారు.
దాంతో భయబ్రాంతులకు గురైన కార్యాలయంలోని ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనిపై మణిరత్నం నుంచి కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.మణి ఆఫీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో మణి ఆఫీసుకు పోలీసులు భద్రత కల్పించారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడనుంచి వచ్చింది చేసిన వ్యక్తి ఎవరు అని కనిపెట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.