Home / Inspiring Stories / పోరాటనికి మారు పేరు మాన్కుబాయి.

పోరాటనికి మారు పేరు మాన్కుబాయి.

Author:

mankubhai

దొరల పాలనలో ఒకప్పుడు తెలంగాణ పల్లె జీవితాలు అతి దరిధ్రంగా ఉండేవి, చదువురాని అమాయక ప్రజలను వారి కనుసైగలతో  పాలించేవారు. పేదవారు పండగకో పబ్బానికో డబ్బులు అవసరం ఉండి దొర దగ్గరికి వెళితే  భూమి కాగితాలు పెట్టుకొని అప్పులు ఇచ్చేవారు. ఇక ఆ అప్పుకి మిత్తిపై మిత్తి వేసి భూమిని పేదవాడి దగ్గర నుండి లాక్కునేవారు.

ఆదిలాబాద్ జిల్లాలోని జంగాం రాంజీగూడలో కూడ ఇలాగే జరిగింది కానీ, ఒక మహిళ తన తండ్రికి జరిగిన అన్యాయానికి అలుపెరుగని పోరాటం చేసి చివరకు తమ భూమిని తమకు చెందేలా చేసుకుంది. తన పోరాట స్పూర్తిని మెచ్చుకొని ఆ మహిళకు తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల బహుమతిని ఇచ్చింది. ఆ పోరాట మహిళ పేరు కుమ్ర మాన్కుబాయి.

మాన్కుబాయి తండ్రి వారు ఇంట్లో పండుగ చేయాలని దొర దగ్గర భూమి కాగితాలు పెట్టి త్వరలోనే అప్పు తీరుస్తా అని డబ్బులు తీసుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత దొర డబ్బులు ఇవ్వమని అడుగుతలేడు దొర మంచోడు అనుకున్నాడు మాన్కుబాయి తండ్రి. కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడగానే నాగలి కట్టుకొని దున్నడానికి వెళ్ళాడు కానీ, ఇతను పోయేవరకు ఆ భూమి మొత్తం దున్ని ఉండటం చూసిన మాన్కుబాయి తండ్రి ఆశ్చర్యపోయి, ఆ భూమిలో ఉన్న దొరను చూసి అడిగాడు అదేంటి దొర నా భూమిలో నువ్వు పని చేస్తున్నావూ అని. అప్పుడు దొర ఇది నీ భూమి ఎందిరా! నీకు డబ్బులు ఇచ్చినప్పుడే సంతకంపెట్టించుకున్నా..! నాకు అమ్మినట్టు, అని అనగానే చాలా భాధపడిపోయాడు. అదే విషయం ఇంటికి వచ్చి ఇంట్లో వారికి చెప్పడంతో ఇంట్లో వారు చేసేది ఏమి లేక బ్రతకడనికి మాన్కుబాయి తోబుట్టువులు నలుగురు అన్నలు,నలుగురు అక్కలు తనతొ కలసి మొత్తం తొమ్మిది మంది తలో దిక్కున బ్రతకడానికి అదే ఊరిలో కూలి పనులకు వెళ్లసాగారు. మాన్కుబాయికి మాత్రం అదే విషయం మదిలో మెదులుతూనే ఉంది….పెళ్ళి అయిన తర్వాత కూడ భర్తతో కలసి కోర్టులో కేసు వెసింది. ఇలా ఒక్క సంవత్సరం కాదు, చాలా సంవత్సరాల తర్వాత హైకోర్టుకు చేరింది ఈ విషయం.

mankubhai

వై.ఎస్.ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు స్వయం సహాయక సంఘల మండల అధ్యక్ష పదవికి మాన్కుబాయి ఎంపికైంది. ఆ సమయంలో లీగల్ కో ఆర్డినేటర్ కు తన భూమి గురించి వివరించింది. దానితో ఆ కో ఆర్డినేటర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ‘గిరి న్యాయ’ పథకం గురించి తెలియజేశాడు. ఈ సమయంలో మాన్కుబాయి తండ్రి చనిపోవడంతో, తండ్రి ఆస్తిలో ఆడబిడ్దకు వాట వస్తుందని ఒక మంచి లాయరుతో కేసు వేయించారు. అంతే కొద్ది రోజుల తర్వాత ఆ దొర ఊరిలో పంచాయితి పెట్టించినా, చివరకు తనను బెదించిన మాన్కుబాయి మాత్రం వెనక్కి తగ్గలేదు చివరకు 32 సంవత్సరాల తర్వాత తన భూమిలో ఇప్పుడు పంట పడించుకుంటుంది మాన్కుబాయి. తన తోబుట్టువులకు ఇవ్వగా మిగిలిన తన వాటాకు వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తుంది. పట్టువదలని దీక్షతో తమ భూమి తమకే చెందాలనీ 30-32 సం.. సుదీర్గ పోరాటానికి తెర పడింది…. పోరటం చేసి  చేసి అలసిన తన శరీరపు చెమట చుక్కతో బీడు భూమిని పంట భూమిగా మార్చింది.

(Visited 274 times, 1 visits today)