Home / Entertainment / సంక్రాంతిని గెలిచేది ఎవరు ..?

సంక్రాంతిని గెలిచేది ఎవరు ..?

Author:

tollywood sankranthi

ఈ ఏడాది ఎన్నడు లేని విధంగా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటి పడుతున్నాయి. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాలు సంక్రాంతి బరి లో ఉన్నాయి. ఈ సంక్రాంతి బరి నుండి ఏ ఒక్కరు కూడా డ్రాప్ అయ్యేటట్లు లేరు ఎందుకంటే ఈ నాలుగు సినిమాల విడుదల పోస్టర్ లు ఇప్పటికే బయటికి వదిలారు. ఒక పక్క బాబాయ్, అబ్బాయిలు వారి ప్రెస్టేజ్ గా ఫీలవుతున్నారు. మరో పక్క నాగార్జున సినిమా అంత పల్లెటూరి నేపధ్యంలో నడుస్తుంది కాబట్టి పండగకు సరిపడే సినిమా నాదే నని హిట్ గ్యారంటి అని గట్టిగా చెబుతున్నాడు. ఎలాంటి స్టార్ డమ్ లేని శర్వానంద్ కూడా ఈ సంక్రాంతి తన సినిమాను లైన్ లో పెట్టేశాడు.

nannaku prematho

అయితే ఈ సినిమా లను ఒక్కసారి పరీశీలిస్తే ఇందులో నాన్న కు ప్రేమ తో సినిమా కు అటు వరల్డ్ క్లాస్ అభిమానుల తోపాటు గా ఇటు ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులకు వీపరీతంగా నచ్చేస్తోంది. ఈ సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ప్రపంచం అంతా ఉన్నారు అనడం లో ఆశ్చర్యం లేదు. సో ఈ సినిమా కు వసూళ్ళ పరంగా ఇబ్బంది ఎమీ ఉండదు. ఇంకా ఇది అన్నింటి కన్నా ముందు వస్తోంది. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆశించేది ఈ సినిమా టాలీవుడ్ రికార్డు లన్నింటిని బద్దలు కోట్టాలని ఆశిస్తున్నారు. ఈ సినిమా ఇలా రికార్డు లన్నింటిని బద్దలు కోడితేనే సినిమా హిట్ అయినట్లు. ఈ సినిమా మెదటి నుంచి చాలా రికార్డు లను బ్రేక్ చేసింది. సుకుమార్ కథలో ఏదైనా తేడా ఉంటే తప్ప నాన్నకు ప్రేమతో సినిమాకు ఎటువంటి అడ్దంకి లేదు.

dictator

ఇక ఆ తరువాత వచ్చేది డిక్టేటర్, మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టేనర్ గా వస్తున్న ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది అనడంలో ఎం సందేహం లేదు. ఇక ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయితే ఈ సంక్రాంతి కి బాలయ్య కు తిరుగె లేదు. ఒక వేళ ఈ సినిమా కనుక మాస్ ఆడియన్స్ కు నచ్చక పోతే చాలా కష్టం ఇది లయన్ సినిమా కన్నా బాలయ్యకు పెద్ద దెబ్బ.

soggade

ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికే ట్రేలర్ తోనే ఫ్యామిలి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విజయం సాదించింది అనే చెప్పాలి. సో వసూళ్ళ పరంగా పెద్దగా ఇబ్బంది ఎమీ ఉండకపోవచ్చు. కానీ సంక్రాంతి బరిలో ఉంటే మాత్రం అనుకున్నంత వసూళ్లు మాత్రం రాకపోవచ్చు.

express raja

దర్శకుడు మేర్లపాక గాంధీ ఇప్పుడు తన రెండో సినిమా ఎక్స్ ప్రెస్ రాజాకు బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతున్నారు. ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, సినిమా సెలక్షన్ లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడని తెలుస్తుంది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో కొంచెం మ్యాటర్ ఉన్న సినిమాకి పెట్టిన డబ్బులు ఈజీగా రాబట్టుకోవచ్చు. కానీ పెద్ద సినిమాలకు పోటీగా వస్తున్న ఈ సినిమా లో కాంటెంట్ లేకపోతే మొదటికే మోసం వచ్చే పరిస్తితి రావొచ్చు

సో ఈ సారి సంక్రాంతి బరిలో స్టోరీ లో దమ్ము న్న సినిమా కే ప్రేక్షకులు ఒటు వేస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎదీ ఎమైనా ఈ సంక్రాంతి పండుగ అందరి నిర్మాతలకు బారీ లాబాలు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం.

(Visited 162 times, 1 visits today)