Home / Entertainment / విడుదలకి సిద్దమైన మన్యం పులి.

విడుదలకి సిద్దమైన మన్యం పులి.

Author:

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ లేటెస్ట్ మలయాళం మూవీ ‘ పులిమురుగన్ ‘. ఈ సినిమా మలయాళంలో 120 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. దానితో ఈ సినిమాని తెలుగులోకి మన్యం పులిగా అనువదైంచి విడుదల చేస్తున్నారు సీనియర్ నిర్మాత సిందూర పువ్వు కృష్ణారెడ్డి. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ‘యు’ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

manyam-puli-release-date

ఈ సినిమా పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి వియాత్నం, కేరళ పరిసర అడవి ప్రాంతాలలో చిత్రీకరణ జరిపారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 2 న విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా కమలిని ముఖర్జీ నటించింది. అలాగే జగపతి బాబు ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు…..

(Visited 66 times, 1 visits today)