Home / Entertainment / మ‌ర‌క‌త‌మ‌ణి రివ్యూ & రేటింగ్

మ‌ర‌క‌త‌మ‌ణి రివ్యూ & రేటింగ్

Marakathamani movie review

Alajadi Rating

3.0/5.0

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రాని, కోట శ్రీనివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం, ఆనంద్ రాజ్‌, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌, రామ్‌దాస్

Directed by: ఎఆర్కే శ‌ణ‌ర‌వ‌న్‌

Produced by: రిషి మీడియా.. శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌

Banner: రిషి మీడియా.. శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌

Music Composed by: రిషి మీడియా.. శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌

ఒకప్పటి హిట్ సినిమాల దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి హీరో గా చేసిన చిత్రమే మ‌ర‌క‌త‌మ‌ణి. ఇప్పటికే త‌మిళంలో హీరోగా చేస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం విలన్ పాత్ర‌లే లభించాయి. విలన్ పాత్రలే ఆదికి మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. కానీ, తెలుగులో కూడా హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్నదే ఆది తాపత్రయం. అందులో భాగంగానే క‌థ‌కి, కథనానికి ప్రాధాన్య‌మున్న స్క్రిప్టులే ఎంచుకుని హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు కొన‌సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే భాగంగా నటించిన చిత్ర‌మే మ‌ర‌క‌త‌మ‌ణి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రూపుదిద్దుకున్న మ‌ర‌క‌త‌మ‌ణి కథా కమామీషు.. తెలుసుకుoదాం.

కథ:

అల్లరిచిల్లరగా తిరుగుతూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హీరో ర‌ఘునంద‌న్ (ఆది పినిశెట్టి). అప్పులెక్కువ అయిపోవడంతో ఎలాగైనా ఈ అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా సిటీకి వచ్చి తన స్నేహితునితో క‌లిసి స్మగ్లింగ్ పనుల చేయడం మొదలెడతాడు. ఇలా చిన్నా చితకా పనులు చేస్తున్న ర‌ఘునంద‌న్‌కి ఒక్కసారే 10 కోట్ల రూపాయల స్మగ్లింగ్ ఆఫ‌ర్ వ‌స్తుంది. మ‌ర‌క‌త‌మ‌ణి అనే ఓ అరుదైన, అతి విలువైన మణిని తెచ్చిస్తే రూ.ప‌ది కోట్లు ఇస్తామ‌ని చైనాకి చెందిన ఓ వ్యాపారి ఆఫ‌ర్ ఇస్తాడు. ఇక్కడే ట్విస్టు మొదలవుతుంది. అదేంటంటే, ఆ మ‌ర‌క‌త‌మ‌ణిని ఎవ‌రు తాకినా ప్రాణాలు కోల్పోవలసిందే. మ‌ర‌క‌త‌మ‌ణిని తాకిన వెంటనే వారిని ఒక పాత వాహ‌నం వెంటాడి మరీ గుద్దేసి చంపేస్తుంది. అలా అప్ప‌టికే ఆ మణిని తాకిన 132 మంది దారుణంగా చచ్చిపోయారని తెలిసి.. ఇంకెవ్వరూ ఆ మణి జోలికి వెళ్ల‌రు. కానీ, అప్పుల బాధ మరియు డబ్బు అవసరం ఉన్న హీరో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మణిని తీస్కోస్తానని ఒప్పందం కుదుర్చుకొంటాడు. ఆద్యంతం మలుపులు తిరిగే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మరి అంత ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌ణిని హీరో కొల్లగొట్టాడా? ఎలా సంపాదించాడు? మరి చివరి వరకి హీరోకి ప‌ది కోట్లు వ‌చ్చాయా? అస‌లింతకీ ఆ మ‌ణి వెన‌క ఫ్లాష్ బ్యాక్ కథేంటి? అనేవీ తెలియాలంటే మాత్రం టికెట్ కొనుక్కుని థియేటర్ కెళ్ళి సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

కథ చందమామ కథ లాంటిదే. ఇలాంటి కథల్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే… కథలోనే ట్విస్టులు, ఆసక్తికర సన్నివేశాలు, చేజింగ్ లు ఉండడం. టైటిల్ కి దగ్గట్టే స్క్రీన్ ప్లే తో నడిచే విభిన్న‌మైన కథాంశం ఈ చిత్రం ప్రత్యేకత. సినిమా కొంచం స్లో గా మొదలవుతుంది. అసలు క‌థ‌ మొదలయ్యాక మాత్రం సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కానీ, కొన్నిసార్లు లాజిక్లను పట్టించుకోకుండా సినిమాని చూడాలసి వస్తుంది. ఆత్మ‌లు వాటికి నచ్చినట్టుగా ఎవరంటే వారి శ‌రీరంలోకి ఈజీగా దూరిపోవడం లాంటివి కొంచం కామెడీగా, టూమచ్ గా అనిపిస్తాయి. కానీ, ఇలాంటి క‌థ‌ల్లో మాయలు మంత్రాల టైపు లేకపోతే కథలోనూ మజా ఉండదు. అందుకే.. అవేవి పట్టించుకోకుండా సినిమా చూడాలి. మ‌ణి కోసం వేట మొద‌ల‌య్యాకే అస‌లు సినిమా స్టార్టవుతుంది. అస‌లు ఆ మ‌ణి ఎక్కడుందనే అన్వేషణతో ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. ఆ మణి ఎక్క‌డుందో క‌నిపెట్టే క్ర‌మం, ట్విస్టులతో సినిమా పరిగెడ్తుంది. మణి దొరికాక కూడా ప్రాణాల్ని కాపాడుకొనేందుకు జరిపే పోరాటం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ కి ముందు సీన్లు మాత్రం క్లైమాక్స్ లెవల్లో భారీగా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. అయితే గమ్మత్తు ఏంటంటే ఇంటర్వల్ తో సినిమా థ్రిల్లర్ నుంచి హార‌ర్ జానర్ లోకి షిఫ్టవుతుంది. మొత్తానికి అన్ని సినిమాల్లో లాగానే క్లైమాక్స్ లో అన్ని చిక్కుముడులు తొల‌గిపోయి కథ సుఖాంతం అవుతుంది. సినిమా ఎండింగులో బ్ర‌హ్మానందం ఎంట్రీ సినిమాకి ప్లస్ పాయింట్. కాకపొతే సినిమాలో త‌మిళ వాసనలు కొంచం ఎక్కువ కావడం తెలుగు వారికి కొంచం ఇబ్బందికరంగా ఉంటుంది.

నటీనటుల పనితీరు:

ఆది చేసిన సినిమాలు తక్కువే.. అందులోనూ ఎక్కువ‌గా సీరియ‌స్ క్యారెక్టర్లే చేశాడు. ఈ సినిమాలో మాత్రం మొదటిసారి జోవియల్ గా స‌ర‌దాగా కనిపిస్తాడు. తన పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. నిక్కీ గ‌ల్రానీ కి ఈ పాత్ర‌ నిజంగా లాభం చేసిందనే చెప్పొచ్చు. ఏ క‌థానాయిక చేయ‌ని ఓ విభిన్న‌మైన పాత్ర చేసిందని చెప్పొచ్చు. అమ్మాయైనా, అబ్బాయిలా న‌టించిన స్టైల్ బాగుంది. ఒకప్పటి విలన్, తెలుగు వాళ్లకి బాగా పరిచయమున్న ఆనంద్ రాజ్ పాత్ర బాగా పేలింది. డాన్ ట్వింకిల్ రామ‌నాథం గా ఆనంద్ రాజ్ ప్రేక్షకులని పిచ్చి పిచ్చిగా నవ్వించాడు. డాన్ పాత్రే అయినా, ఆయ‌న క‌నిపించిగానే థియేటర్ లో నవ్వుల పువ్వులు పూస్తాయి. మిగతా అందరు నటులు కూడా తమ తమ పరిధిలో నటించారు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగా తీశారు. పెట్టిన బడ్జెట్ సినిమాలో ప్రతి ఫ్రేములోనూ కనబడుతుంది. దిబు నైన‌న్ థామ‌స్ సంగీతం, పి.వి.శంక‌ర్ కెమెరా వర్కు లకి మంచి మార్కులు ప‌డతాయి. వీళ్ళిద్దరి ప‌నిత‌నం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ద‌ర్శ‌కుడు.శ‌ర‌వ‌ణ‌న్ కథ, కథనంతో కట్టిపదేసినట్టే చెప్పొచ్చు. మొత్తం మీద ఈ సినిమా ద్వారా ఒక మంచి థ్రిల్లర్ చూసినట్టే.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ, స్క్రీన్ ప్లే
  • ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • స్లోగా మొదలయ్యే ఫస్టాఫ్
  • ఎక్కువైన త‌మిళ వాసన
(Visited 1,523 times, 1 visits today)