Home / Inspiring Stories / పారా ఒలింపిక్స్ లో భారత్ కి స్వర్ణ పతకం.

పారా ఒలింపిక్స్ లో భారత్ కి స్వర్ణ పతకం.

Author:

ఒలింపిక్స్ లో ఆశించిన మేరకు మన క్రీడాకారులు సత్తా చాటలేకపోయిన వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే పారా ఒలింపిక్స్ లో మాత్రం మన ఆటగాళ్లు సత్తా చాటారు, నిన్న జరిగిన హైజంప్ పోటీలలో ఇద్దరు భారత దివ్యాంగ వీరులు… పతకాలు సాధించారు. హైజంప్ లో… మరియప్పన్ తంగవేలు బంగారు పతకం సాధించాడు. ఇదే ఈవెంట్ లో … వరుణ్ సింగ్ భాటీ బ్రాంజ్ మెడల్ కొట్టాడు.

పారా ఒలింపిక్స్ లో భారత్ కి స్వర్ణం,కాంస్య పతకాలు.

ఐదేళ్ల వయసులోనే ఒక ఆక్సిడెంట్ లో ఒక కాలు కోల్పోయిన మరియప్పన్ తంగవేలు ఆత్మ విశ్వాసంతో హైజంప్ లో మేటి క్రీడాకారుడిగా తయారయ్యాడు, చిన్నప్పటి నుండే అథ్లెటిక్స్ ఈవెంట్స్ పై దృష్టిపెట్టి . హైజంప్ ప్రాక్టీస్ చేసి ఒక్క కాలుతోనే హై జంప్ చేసి మన దేశానికి బంగారు పతకాన్ని సాధించాడు, ఒలింపిక్స్ రజత, కాంస్య పతకాలు తెచ్చిన వారికి కోట్లు కుమ్మరించి, సత్కారాలు చేసిన రాజకీయ నాయకులకి ఇప్పుడు మరియప్పన్, వరుణ్ సింగ్ భాటిలని ఎలా ఆడుకుంటారో చూడాలి, ఒలింపిక్స్ సమయంలో బాగా హడావుడి చేసిన మీడియా చానెళ్లు కూడా వీరిని పట్టించుకోలేదు, కనీసం ఇప్పుడైనా వారి గురుంచి ప్రజలందరికి తెలిసేలా చేస్తే భవిష్యత్ లో మరింత మంది క్రీడాకారులు పతకాలు తెచ్చే అవకాశం ఉంటుంది.

(Visited 427 times, 1 visits today)