Home / Inspiring Stories / కొందరు ఉగ్రవాదుల వల్ల ముస్లిం లను వివక్ష కు గురి చేయొద్దు

కొందరు ఉగ్రవాదుల వల్ల ముస్లిం లను వివక్ష కు గురి చేయొద్దు

Author:

mark

ఉగ్రవాద సమస్య ప్రమాదాన్ని, ముప్పును గుర్తించనంత వరకూ భయంకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇకముందు ఉగ్రదాడులకు మన దేశంలోని పౌరులు బలి కాకూడదు. వారు జిహాదీని నమ్ముకున్నారు. అమెరికా పట్ల ముస్లింల వైఖరి తెలిసే వరకు వారి ప్రవేశాన్ని నిషేధించాలి’ అని రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ముస్లిం లపై చేసిన వ్యాఖ్యలివి. ప్రపంచవ్యాప్తంగా నే కాకుండా సొంత పార్టీ వారితో కూడా ఇలాంటి అనాలోచిత అహంకార పూరిత మాటలకు గానూ ఆయన విమర్షలను ఎదుర్కున్నారు.

అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడిని పట్ల ముస్లింలు హర్షం వెలిబుచ్చుతున్నారని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. న్యూజర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో ఉన్న ముస్లింలు 2001 నవంబర్‌ 9న మస్‌హట్టన్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడిపట్ల ఆనందంగా ఉన్నారని అయన అన్నారు. ఫ్లోరిడాలోని సారాసోటలో జరిగిన ప్రచార సభలో ట్రంప్‌ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారని కొన్ని సంఘటనల ఆధారం గా ఒక జాతిమొత్తాన్నీ వేలెత్తి చూపటం సరికాదనీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు దేశం లోని ముస్లిం లలో అభద్రతా భావాన్ని పెంచితే దాని వల్ల వచ్చే సమస్యలు ప్రపంచాన్ని మరింత జటిలమైన పరిస్థితుల్లో పడేఅస్తాయన్న ఆలోచన లేకుండా చేసిన వ్యాఖ్యలమీద పలువురు మండిపడ్డారు. మత చాందస వాదం పై తమ పోరాటానికి మద్దతు తెలపాలనీ,ముస్లిం లపై జరిగే దాడులు గా కాక ఉగ్రవాదులపై యుద్దం చేస్తున్నట్టు గా భావించాలనీ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు సరికాదనీ సమ్యమనం తో మాట్లాడటం మంచిదనీ సలహా కూడా ఇచ్చారు.

కాగా ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించాడు. అమెరికాకు రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరీ అభ్యంతర కరం గా వున్నయనీ, కొంతమంది చర్యలకు ముస్లింలు అందరు బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పారిస్ దాడులు, ఇతర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లింలను వివక్షకు గురిచేయటం అనేది కూడా మానవత్వం కాదు అంటూ జుకర్ తన ఫేస్ బుక్‌ పేజీలో తెలిపారు. “యూదు మతానికి చెందిన వాడిగా ఉన్నప్పుడు యూదులకే కాదు ఏ మతంపై దాడి జరిగినా, ఏ మతం లోని మనుషులకు కష్టం వచ్చినా ఎదురునిలవాలని” తన తల్లితండ్రులు చెప్పారని అన్న జుకర్ బర్గ్, ముస్లింల హక్కులు, శాంతియుత వాతావారణం కోసం పోరాడుతానని చెప్పారు.

(Visited 86 times, 1 visits today)