Home / Inspiring Stories / 99% తండ్రి అనిపించుకున్న జుకర్ బర్గ్.

99% తండ్రి అనిపించుకున్న జుకర్ బర్గ్.

Author:

Mark

ప్రియ మైన మ్యాక్స్ …
భవిష్యత్ పై నీవు మాకిచ్చిన నమ్మకాన్ని ఎలా వివరించాలో అర్థం కావడం లేదు.నీ ఈ కొత్త జీవితం సంతోషాలతో.ఆరోగ్యవంతంగా సాగుతుందని భావిస్తున్నాం.అందరి తల్లిదండ్రుల్లాగానే మేము కూడా మీకు మా కన్నా గొప్ప జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం.కేవలం నీ మీద ఉన్న ప్రేమతో మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదు.నీవంటి అందరు చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం” అని జుకర్ బర్గ్ తన కూతురు మ్యాక్స్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిజానికి ఎది జుకర్ బర్గ్ తాను సమాజానికి రాసిన లేఖ మ్యాక్స్ కు చెబుతున్నట్టు గా తాను చేయబోయే పనిని ప్రపంచానికి తెలియజేసాడు.

సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ది తొలి విజయమన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఒకే వేదికపైకి చేర్చిన ఫేస్ బుక్‌తో దాని సహ వ్యవస్థాపకుడు, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ అత్యంత పిన్న వయసులోనే బిలియనీర్‌గా అవతరించాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న జుకెర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్‌ల ఉమ్మడి ఆస్తి 45 బిలియన్ డాలర్లకు పైగా ఉండటం గమనార్హం. తమకు పాపాయి పుట్టిన సంబురంలో ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌, ఆయన సతీమణి ప్రిసిల్లాచాన్‌లు ఫేస్‌బుక్‌లో వారిద్దరికీ ఉన్న షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తమ కూతురు మాక్స్‌ను ఉద్దేశించి రాసిన లేఖలో తెలుపుతూ ఆ లేఖను జుకెర్‌బెర్గ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు. సమాజ హితం కోసం ఫేస్‌బుక్‌ అధినేత వదులుకోవడానికి సిద్ధపడ్డ ఫేస్‌బుక్‌ 99శాతం షేర్ల ప్రస్తుత మార్కెట్‌ విలువ 45 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు. అంటే దాదాప్ 3 లక్షల కోట్లు. చాన్‌ జుకెర్‌బెర్గ్‌ పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఆ ట్రస్టు ద్వారా ఈ సొమ్మును ఖర్చుచేయనున్నారు. తమ జీవితకాలంలోనే ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు జుకెర్‌బర్గ్‌ దంపతులు ప్రకటించడం గమనార్హం. వ్యాధులకు చికిత్స చేసేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సమానహక్కులు కల్పించేందుకు, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, సమానత్వాన్ని పెంచేందుకు, ప్రజలను అనుసంధానం చేసేందుకు, వివిధ దేశాల మధ్య అవగాహనను విస్తరించేందుకు ఈ మొత్తం ఉపయోగపడాలని జుకెర్‌బెర్గ్‌ ఆకాంక్షించారు.

(Visited 117 times, 1 visits today)