Home / Inspiring Stories / మరుగున పడ్డ మహా వీరుడు లాల్ బహదూర్.

మరుగున పడ్డ మహా వీరుడు లాల్ బహదూర్.

Author:

1904 అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జయంతిగానే చాలా మందికి తెలుసు. ఐతే భారత చరిత్రలోనే వీరత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన లాల్ బహదూర్ పుట్టిన రోజు కూడా ఇవాళే.. ఇంటి పేరు శ్రీవాత్సవ.. ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించిన లాల్ బహదూర్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి .తల్లి తో సహా బీదరికం లో మగ్గిపోయి. తాత దగ్గర మేనమామల దగ్గర ఒక అనాధలా చదువు కోవటానికి రోజూ రెండు సార్లు నదిని ఈదుకుంటూ వెళ్ళిన సాహసి ఐన ఒక అతి సామాన్య పౌరుడు. గాంధీ భావాల పట్ల ఆకర్షితుడైనా తన సొంత సిద్దాంతాలకూ విలువైచ్చే మనిషి కులమతాలకి తాను అతీతుణ్ణనే భావంతో శ్రీ వాత్సవ అన్న ఇంటి పేరుని సైతం ఎప్పుడూ వాడని సమతా వాది.. నిజానికి శాస్త్రీ అన్నది ఆయన కాశీ విధ్యాపీఠ్ లో పొందిన పట్టా.. అదే తర్వాత ఆయన ఇంటి పేరయింది.

లాల్ బహదూర్ jai jawan jai kisan

చదువు కోసం రోజూ నదిని ఈదుతూ ప్రాణాలకు తెగించిన లాల్ బహద్దూర్ స్వాతంత్ర్య సమరం లో పాల్గొనటానికి చదువును సైతం వొదులుకున్న దేశ భక్తుడు. జైలుకి వెళ్ళి విడుదలైన తరువాత మళ్ళీ చదువు పూర్తి చేసిన మొండి పట్టుదల గల వ్యక్తి. ఎర్రకోటపై జెండా ఎగరెయ్యడానికి వెళ్ళిన వాళ్ళని బ్రిటిష్ సైనికులు అడ్డుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళ సందుల్లోంచి వెళ్ళి మరీ ఎర్రకోటపై జెండా ఎగరవేసిన ధిక్కార వ్యక్తిత్వం..స్వాతంత్ర్యం వొచ్చాక.. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి గోవింద వల్లభ పంత్ కు పార్లమెంటరీ సెక్రటరీగా ప్రారంభించిన తన రాజకీయ జీవితంలో అంచెలంచలుగా తన నిజాయితీతో, నిబద్ధతతో…ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖామంత్రిగా, హోం శాఖామంత్రిగా, ఆ తరువాత నెహ్రూ ప్రధాన మంత్రిగా కల కేబినెట్ లో కేంద్ర రైల్వే మంత్రిగా చేసారు. కానీ తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసారు “అది నా వైఫల్యమే అని నేను భావించాను ఎంత మాత్రమూ నేను ఆ పదవిలో కొనసాగటానికి అర్హుడిని కానని నాకు అనిపించింది” అని ఆయన వైదొలగే సమయంలో చెప్పారు. తర్వాత వచ్చిన సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రి వర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా ఏ పదవి అయినా అదే నిరాడంబరత ఆయనలో తదనంతర పరిణామాల్లో నెహ్రూ మరణంతో శాస్త్రి భారత ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. 1964 లాల్ బహదూరు కార్యశీలతకి, ధైర్య సాహసాలకు నూ మరో సారి నిరూపించింది.  1965 లో వొచ్చిన పాకిస్తాను తో యుద్ధం అంతకు ముందు దాకా అక్కర్లేని శాంతి వచనాలతో దేశాన్ని నిర్వీర్యం చేసిన స్థితినుండి దేశాన్ని ఉత్తేజం దిశగా, ఉత్సాహం దిశగా ఉరకలెత్తించిన ఖ్యాతి కేవలం లాల్ బహదూర్…. దేశానికి రెండే మూల స్థంభాలు.. జై కిసాను.. జై జవాను అంటూ నినదించి దేశానికి దిశానిర్దేశనం చేసిన మహా శక్తి లాల్ బహదూర్. అన్ని సంవత్సరాల రాజకీయ జీవితం లో ఎన్నో పదవులని పొందినా తన కోసం కనీసం సొంత ఇల్లు కూడా సంపాదించుకోని లాల్ బహదూర్ నిజాయితీ ని చూసైనా మన నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి ఒక పంచాయతీ మెంబర్ కూడా లక్షలు కూడపెట్టుకుంటున్న రాజకీయాల్లో సొంత ఇల్లు లేని లేని దుర్భర పరిస్థితుల్లో లాల్ బహదూర్ భార్య లలితా శాస్త్రి గడిపారని తెలిసాక  గర్వం తోకూడిన విషాదపు నవ్వు మన మొహం లోకి రాకమానదు…

లాల్ బహదూర్ jai jawan jai kisan

అలాంటి శాస్త్రి ఇంకా కొద్ది కాలం బ్రతికి ఉండి ఉంటే  మన దేశ పరిస్థితి ఎలా ఉండేదో గానీ… అప్పట్లో కాంగ్రేసుకు అత్యంత ప్రీతి పాత్రమైన సోవియట్ యూనియన్ కి (ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ పర్యటనకు ) వెళ్ళాడు  లాల్ బహద్దూర్ , అక్కడ తాష్కెంట్ లో ఒక సమావేశం దౌత్యపరమైన పర్యటనకై వెళ్ళి అక్కడ అప్పటి పాక్ ప్రధాని అయూబ్ తో రష్యా మధ్య వర్తిత్వం లో ఒప్పంద కాగితాలపై సంతకాలు చేసి…. అదే రాత్రి  జనవరి 10 1966″ న రష్యాలోనే మరణించారు. అక్కడే గుండె ఆగి  మరణించాడని డాక్టర్లు చేసిన ప్రకటన విషయంలో ఎవరికి ఎన్ని అనుమానాలు ఉన్నా ఏమీ చెయ్య లేని పరిస్థితిలో  స్వయంగా భార్య లలితా శాస్త్రి తన భర్త ఆరోజు తాగిన పాల గ్లాసు కనపడలేదని, అది ఉంటే ఫోరెన్సిక్ నిపుణుల చేత పరీక్షలు చేయిస్తే అసలు కారణం బయట పడుతుందనీ.. చెప్పినా వినిపించుకోలేదంటూ వచ్చిన వార్తలు కూడా వినిపించాయి.

వీరుడేలా ఉండాలి అంటే ఆరడుగులుండాలి అంటే నవ్వొస్తుంది నాకు శాస్త్రి లాంటి హీరో ని వాళ్ళు చూడనందుకు… సాల్యూట్ టు మై నేషనల్ హీరో.

(Visited 1,768 times, 1 visits today)