Home / Entertainment / భలే భలే.. మారుతికి మెగా ఆఫర్

భలే భలే.. మారుతికి మెగా ఆఫర్

Author:

Maruti

మారుతి డైరెక్టర్ కాక ముందు మంచి డిస్ట్రిబ్యుటర్ ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యుట్ చేసాడు,తర్వాత .బస్ స్టాప్..ప్రేమ కధా చిత్రలతో డైరెక్టర్‌ గా మారుతి వరుస సినిమా సక్సెస్‌లు సాధించి బిజీ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. నాని హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ సక్సెస్‌ సాధించడంతో ఇప్పుడు తెలుగులో బిజి డైరెక్టర్స్ లో ఒకడిగా చలామని అవుతున్నాడు.

ఇప్పుడు  వెంకటేష్ తో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మనోడికి మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మారుతీతో ఓ మూవీ చేసేందుకు సై అన్నాడట. మారుతీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఖచ్చితంగా చేద్దామని మాటిచ్చాడట రామ్ చరణ్ కాని మారుతి సినిమా వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు ఎందుకంటే సురేందర్ రెడ్డి, సుకుమార్, కొరటాల శివ వంటి వారితో వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు వాటి తర్వాత మారుతి మూవీ చేయాల్సి ఉంది.

(Visited 198 times, 1 visits today)