Home / Inspiring Stories / మతోన్మాదం పై కవితాగ్రహం.

మతోన్మాదం పై కవితాగ్రహం.

Author:

Kavitha agaraham1

“అసహనం” ఇప్పుడు భారత దేశం లో వాడుకలో ఉన్న ఒకే ఒక పదం. ప్రపంచం లోనే ఏకైక అతిపెద్ద లౌకిక దేశమైన భారత దేశం లో సాక్షాత్తూ ఒక ప్రభుత్వమే ఒక వర్గానికి మద్దతుగా నిలబాడట్టుగా ప్రత్యక్ష చర్యలతో నిరూపించుకుంటొఈంది అన్న ఆరోపనల నేపథ్యం లో. ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా తమ నిరసన గలాళను వినిపించిన పలువురు రచయతలూ కళాకారులపై జరిగుతున్న దాడులను ప్రశ్నిస్తూ.రాజ్యాంగం ఇచ్చిన హక్కులమీదనే ఆంక్షలు విధించే చర్యలను ఖండిస్తూ లౌకిక,ప్రజాస్వామిక కవులూ,కళాకారుల ఐక్యవేదిక నిన్న్ నగరం లో ఒక నిరసన ప్రదర్షణను నిర్వహించింది.

Kavitha agraham2

సరిగ్గా రెండేళ్ల క్రితం 2013 ఆగస్టు 20వ తేదీ ఉదయం మహారాష్ట్రలో ప్రముఖ హేతువాది, రచయిత నరేంద్ర దబోల్కర్‌ను ఇలాగే కాల్చి చంపారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన అపుపెరక్కుండా పోరాడారు.అందుకు గానూ “గుర్తు తెలియని వ్యక్తులు” గా చెప్పబడుతున్న కొందరు ఉన్మాదులు ఆయనను చంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న అదే మహారాష్ట్రలో మరొక దారుణం. సిపిఐ నేత, రచయిత, టోల్‌గేట్‌ వ్యతిరేక ఉద్యమకర్త అయిన గోవింద్‌ పండరీనాథ్‌ పన్సారే తన భార్యతో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి వస్తుండగా, దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. అరాచకశక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా పనిచేయడం, రచనలు చేయడం ఆయన చేసిన నేరం. అదే విధంగా ఎంఎం కల్బురిగీ నీ పొట్టన పెట్టుకున్నారు. దీనికి ముందు తమిళనాడులో పెరుమాల్‌ మురుగన్‌ అనే నవలా రచయిత పట్ల కూడా కులోన్మాద అరాచక శక్తులు తీవ్ర దౌర్జన్యానికి పాల్పడ్డాయి. వందేళ్ల క్రితం నాటి ఒక సాంప్రదాయాన్ని ఒక నవల్లో సూచనప్రాయంగా పేర్కొనటం ఆ శక్తుల కన్నెర్రకు కారణం అయింది. అధికారులు రచయితకు రక్షణ ఇవ్వాల్సింది పోయి, వారి సమక్షంలోనే అభ్యంతర కారులకు మురుగన్‌ చేత క్షమాపణ చెప్పించారు. దాంతో మనస్తాపం చెందిన పెరుమాళ్‌ ‘రచయితగా నేను చనిపోయాను’ అని తీవ్రమైన ప్రకటన చేశారు.

ఇన్ని సంఘటనల నేపథ్యం లో రచయతలూ,కవులూ భయపడుతుతూ బతకాల్సిన పరిస్థితులపై ఆగ్రహ ప్రకటనగా ఈ ప్రదర్శన సుందరయ్య పార్క్ నుంచీ ఇందిరా పార్క్ వరకూ సాగింది. సామాజిక కార్య కర్తలూ,విరసం సభుయ్లూ,జననాట్య మండలి కళాకారులతో జరిగిన ఈ ప్రదర్శనలో కవులూ,రచయితలయిన నందిని సిథా రెడ్డీ, జన నాట్య మండలి విమల,వారి బృందం, ప్రముఖ రచయిత వేముల ఎల్లయ్యా, “భూమిక” పత్రిక సంపాదకులూ అయిన కొండ వీటి సత్యవతీ, ప్రరవే సభ్యులు శాంతి ప్రబోద,విజయ బండారు, విరసం సభ్యులయిన గీతాంజళి, రివేరా, రాంకి మొదలైన వారు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం గా తమ నిరసనా వాదాన్ని వినిపించారు. జననాట్య మండలి కళాకారుల ప్రదర్శన ర్యాలీ పోడవునా ఆకట్టుకుంది.

(Visited 300 times, 1 visits today)