Home / Political / మాంసం పండిస్తున్నారు… కోడిని చంపకుండానే చికెన్ తినొచ్చు

మాంసం పండిస్తున్నారు… కోడిని చంపకుండానే చికెన్ తినొచ్చు

Author:

meat forming

మాంసం మనకు అత్యదిక పోషకాలనందించే ఏకైక సులభ మార్గం, అందరూ శాఖా హారులే అయిపోతే వచ్చే ఆహార కొరతను తగ్గించేందుకు కూడా ఒక మార్గం… కానీ ఒక ప్రాణం ఉన్న జంతువును పట్టుకొని కిరాతకంగా దాని మెడని కోసి రక్తం తో సహా ఆ జీవి శరీరభాగాలను చీల్చుకు తినే హక్కు మనకెవరిచ్చారు? మనిషంటే మానవత్వం ఉన్న వాడే కదా మరి ఆహారం కోసం ఒక జీవిని చంపటం ఎంత దారుణం..!? ఇలాంటి ఆలోచనలే అతన్ని ఒక అడుగు ముందుకు వేయించాయి… జంతువులను చంపకుండానే ఆ మాంస పొందే అవకశం లేదా అని ఆలోచించిన ఆ డాక్టర్ ఒక పరిష్కారాన్ని కనిపెట్టాడు…. అదే “ల్యాబ్ మీట్” అంటే కృత్రిమంగా మాంసం తయారు చేయటం. కృత్రిమ మాంసం అనగానే ఇదేదో అనారోగ్యకరం, రసాయనాలతో తయారు చేసే ఫేక్ మాంసం అనుకోకండి “లాబరేటరీలో కొన్ని జంతు కణాలకు గ్లూకోజ్, పోషకాలను అందించటం ద్వారా జీవ క్రియలు లేకుండానే అదే తరహా కణాలు పెరిగేలా చేస్తారు, అంటే మాంసం ఒక ప్రాణిలా కాకుండా కేవలం మాంసం లాగానే పెరుగుతుందన్న మాట…. ఇంకా అర్థం కాలేదా..! ఐతే ఇది చదవండి…..

              ఉమా ఎస్ వాలేటీ… అమెరికాలో ఓ పెద్ద డాక్టర్. మాయో క్లినిక్ లో శిక్షణ పొందిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో అసోసియేట్ ప్రొఫెసర్. ట్విన్ సిటీస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఈ మధ్యే ఓ పరిశోధన ద్వారా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోతుంది. ల్యాబ్ లో మాంసం తయారు చేసి సంచలనం సృష్టించారాయన. ఇండియన్ అమెరికన్, అందునా తెలుగోడు అయిన వాలేటీ… సైంటిస్ట్ టీమ్ తో చేసిన కృషి ఫలితమే ఈ విజయం. మెంఫిస్ లో బార్బిక్యూ చైన్ రెస్టారెంట్స్ ఉన్న బయోమెడికల్ ఇంజనీర్ విల్ క్లెమ్, స్టెమ్ సెల్ బయాలజిస్ట్ నిఖోలస్ జెనోవీస్ తో కలిసి మెంఫిస్ మీట్స్ ను నెలకొల్పారు వాలేటీ. వీరి కంపెనీకి వెంచర్ క్యాపిటల్ కూడా వచ్చింది. జంతు కణాలను తీసుకొని వాటి నుంచి మరిన్ని కణాలను పుట్టిస్తారు. ఆ కణాలకు ఆక్సిజన్ తో పాటు చక్కెర, ఖనిజాల్లాంటి పోషకాలు అందిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 9 నుంచి 21 రోజులు పడుతుంది. ఆ తర్వాత మాంసం రెడీ. జంతు వధను తగ్గించడం, తద్వారా వచ్చే దుష్ఫలితాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ ఆలోచనకు బీజం పడింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున జంతు వధను తగ్గించడానికి ఈ ఫార్ములా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే అవయవ మార్పిడీ కోసం కృత్రిమ అవయవాలని అభివృద్ది చేసే ప్రక్రియ నే ఇక్కడ వాడారన్న మాట.

meat forming scientist

                ఇక మీదట చికెన్ కావాలంటే కోడిని చంపక్కరలేదు, మటన్ కోసం ఒక మేకనో,ఎద్దునో మెడకోసి చంపే పనీ లేదు ఏ మాంసం కావాలన్నా రెడీ అయిపోతుంది. పౌల్త్రీ ఫారం, గోట్ ఫారం, కబేళా అనే మాటలన్నీ ఇక కనుమరుగు కానున్నాయి. రాబోయే సంవత్సరాల్లో అయితే ఈ ఫార్ములాతో మాంసాన్ని తయారు చేసి మార్కెట్లో అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఈ మాంసం తినడం ద్వారా ఆరోగ్యపరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్యాక్టీరియా కలుషితం కూడా లేదు. కొవ్వు పెరిగే ఛాన్సే లేదు. ఇక జంతువధ ఎలాగూ ఉండదు. కాబట్టి తద్వారా వచ్చే పర్యావరణ సమస్యలూ తగ్గిపోతాయి. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఎక్కువకాలం నిల్వ ఉండే మాంసాన్ని తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. బీఫ్, చికెన్ లాంటి ప్రధానంగా తినే మాంసాహారంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బీఫ్ మీట్ పై టెస్ట్ రన్స్ జరిగాయి. రాబోయే మూడేళ్లలో రెస్టారెంట్లకు, ఐదేళ్లలో రీటైల్ గా అమ్మడమే వీరి టార్గెట్. తొలి తయారీ యూనిట్ ను అమెరికాలోనే నెలకొల్పుతారు. దాంతో పాటు భారతదేశం, చైనాల్లో తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను చూస్తున్నారు. సో… ఇది వర్కవుట్ అయితే… ఇకపై మాంసం తినాలంటే మేకను కొయ్యాల్సిన అవసరం లేదు. చికెన్ కావాలంటే కోడి తల తీయక్కర్లేదన్నమాట. మాంసం తినడానికి జంతువును చంపాల్సిన అవసరం కూడా రాదు…
ఈ ఆలోచనేదో బావుంది… ఇక మాంసం తినటం పాపం కాదు..ఆకలి కోసం మరో ప్రాణం తీస్తున్నాం అని భాదపడక్కర లేదు హాయిగా కావాల్సినంత మాంసం పండించుకోవటమే వండించుకోవటమే….

(Visited 835 times, 1 visits today)