Home / Inspiring Stories / తెలంగాణా & ఆంధ్రప్రదేశ్ లో మీయొక్క భూమి వివరాలు సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?

తెలంగాణా & ఆంధ్రప్రదేశ్ లో మీయొక్క భూమి వివరాలు సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?

Author:

గ్రామాలలో కానీ, పట్టణాలలో కానీ ఎక్కోడో అక్కడ అందరికి భూమి ఉంటుంది, కానీ సంభందించిన సర్వే నెంబర్,భూమి వివరాలు గురుంచి మనలో చాలా మందికి తెలియదు, అసలు మన భూమి ఎవరి పేరు ఉంది, ఎంత ఉంది అనేది తెలియదు, భూమి గురుంచి తెలుసుకోవాలని ఉన్నరెవిన్యూ ఆఫీస్ లో లంచం ఇవ్వాలి, అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సి ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు.

Check-Land-Details-Online-Telangana-Andhra-Pradesh మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?

ఇప్పుడు ఏమాత్రం కష్టపడకుండా ఇంట్లో కూర్చొనే మన భూమి వివరాలని తెలుసుకోవచ్చు, మన రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన భూ వివరాలు, సర్వ్ నెంబర్ తో సహా తెలుసు కోవడానికి మనకు ఒక వెబ్ సైటు వుంది. దానిలో జిల్లా , మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు ఎవరైనా తెలుసుకోవచ్చు, రాష్ట్రంలో ఎక్కడ ఎంత భూమి ఉంది, సర్వే నెంబర్ తో సహా అన్ని వివరాలని తెలుసుకోవచ్చు.

Check-Land-Details-Online-Telangana-Andhra-Pradesh మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా తెలుసుకోవాలని ఉందా ?

భూమి వివరాలని, సర్వే నంబర్ ని తెలుసుకోవడానికి ఇలా చేయండి:

  • మన రెండు రాష్ట్రాలకి వేరు వేరు వెబ్ సైట్ లు ఉన్నాయి,
  • తెలంగాణ రాష్ట్రం వెబ్ సైట్: Maabhoomi.telangana.gov.in
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వెబ్ సైట్:Meebhoomi.ap.gov.in
  • వెబ్ సైట్ ని ఓపెన్ చేసాక జిల్లా ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తరువాత మండలాన్ని, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత సర్వే నంబర్ లేదా ఖాతా నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా పట్టాదారుని పేరు ని ఎంటర్ చేయాలి.
  • ఆ వెంటనే మీరు ఇచ్చిన వివరాలకి సంభందించిన భూమి వివరాలు వస్తాయి.
  • ఒకవేళ గ్రామానికి సంభందించిన మొత్తం భూమి వివరాల గురుంచి తెలుసుకోవాలంటే వెబ్ సైట్ హోమ్ ఆప్షన్ పక్కనున్న పహాణి/అడంగల్ పై క్లిక్ చేయాలి.

Must Read: 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పోయిందా? ఇప్పుడు చాలా సులభంగా తిరిగి పొందవచ్చు.

(Visited 39,352 times, 1 visits today)