Home / Entertainment / కోటీశ్వరుడు కావటం కోసం రెడీ నేనా ?

కోటీశ్వరుడు కావటం కోసం రెడీ నేనా ?

Author:

ఒకప్పటి దుమారం కౌన్ బనేగా కరోడ్ పతీ కి పేరడీ గా వచ్చిన ప్రోగ్రాం ” మీలో ఎవరుకోటీశ్వరుడు ?” తెలుగు వెండి తెర మన్మథుడు నాగార్జున స్టార్ స్టామినా తోనే మంచి హైప్ పొందిన ఈ ప్రొగ్రాం మళ్ళీ మొదలు కానుంది.  మోదటి రెండు సిరీస్ లలోనూ మంచి రేటింగ్ నే రాబట్టుకుంది. ఒక్కొక్క ప్రశ్నతో ఒక్కొక్క మెట్టే ఎక్కిస్తూ మన తెలివితేటలతోనే లక్షలు సంపాధించుకునే కాన్సెఒట్ తో వచ్చిన ప్రోగ్రాం లు తెలుగులో తక్కువే. హిందీలో వచ్చిన “కౌన్ బనేగా కరోడ్ పతీ“, “సవాల్ దస్ కరోడ్ కా” మళయాలం లో మమ్ముట్టి కోటీశ్వరన్ లాంటి ప్రోగ్రాం లు అప్పట్లో మంచి మార్కెట్ నే రాబట్టుకున్నయి. తర్వాత తెలుగులో మాటీవీ లోనే వచ్చిన బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా కూడా అప్పట్లో మంచి టీ ఆర్ పీ నే రాబట్టింది. అప్పుడు యాంకర్ ఝాన్సీ ఈ షో కి హోస్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు కూదా.. ఐతే బ్రెయిన్ ఆఫ్ ఆంద్రా పారితోషికం 5 లక్షలే కావటం కాస్త తక్కువ మొత్తమే అనుకున్నారో ఏమో నాగ్ ఒక్క సారి కోటి రూపాయలతో మళ్ళీ ఒక స్టార్ షోని తెరపైకి తెచ్చారు..

తన హావభావాలతోనూ ఆయన స్టార్ రేంజ్ తోనూ తెలుగు రియాలిటీ షో కి స్టార్ తళుకులద్దారు. తన మెస్మరిజింగ్ స్మైల్ తో నూ మంచి వాక్చాతుర్యం తోనూ షోని సక్సెస్ గా రన్ చేసారు. చాలా మంది ఈ షొ ధ్వారా లక్షాధికారులయ్యారు. నాగ్ తన లో ని సాఫ్ట్ కన్సర్న్ ని కూడా చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. కొంతకాలం గా అక్కినేని నాగేశ్వర రావు గారి మరణం తో వాయిదా పడ్డ మూడో సిరీస్ ఇప్పుడు మళ్ళీ మొదలు కానుంది. ” మీలో ఎవరు కోటీశ్వరుడు “? అంటూ మళ్ళీ అందాల మన్మథుడు మాటీవీ తెర మీద సందడి చేయనున్నాడు. మూడో సిరీస్ కి ట్రైలర్ కూడా సిద్దమైపోయింది. ఇక జెనరల్ నాలెడ్జ్ బుక్స్ ముందేసుకొని రెడీ ఐపోండి. డబ్బు మాట పక్కన పెడితే నాగ్ తో కనీసం ఒక గంట
మాట్లాడే చాన్స్ ఊర్కే రాదు కదా…!

(Visited 135 times, 1 visits today)