ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇక లేనట్టేనా..? తాజా పరిణామాలని చూస్తే అలానే అనిపిస్తోంది. 25 న ప్రదాని మోడీ తో చంద్ర బాబు భేటీ తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కాస్త ప్రత్యేక ప్యాకేజీ గా మారింది. ఢిల్లిలో ప్రధాని తో సమావేశమైన చంద్ర బాబు తో ” ప్రత్యేక హోదానే ఎందుకు మీకు ప్యాకేజీ ద్వారా ఎక్కువే ఇస్తున్నాం కదా ” అన్న మోడీ ఏ పీ పునర్వ్యవస్తీకరణ చట్టం 2014 ప్రకారం అన్ని హామీలూ నెరవేరే విధంగా ప్రణాలికని సిద్దం చేయమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను ఆదెశించినట్టు తెలుస్తోంది.
సమావేశం అనంతరం చంద్ర బాబు తో పాటు బయటికొచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ” పేరులో ఏముంది ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ లో మీరనుకున్న దానికంటే ఎక్కువే వస్తాయ్, ఐనా ప్రత్యేక హోదా అనేది ప్రధాని కోర్టులో ఉన్న విశయం నీతి ఆయోగ్ నివేదికను చూసాక ఈ విశయం లో ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు ” అన్నారు. తర్వాత చంద్ర బాబు మాట్లాడుతూ ” ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదనీ, సమస్యలన్నిటికీ ప్రత్యేక హోదా ద్వారానే తీరిపోవనీ అన్నారు. విభజన అనేది మాకు ఇస్టం లేకుండా జరిగిన పరిణామం. ఆంధ్రప్రదెశ్ ని ఏ వనరులూ లేకుండా విభజించారనీ, అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలూ, సంస్థలు తెలంగాణాలోనె ఉన్నాయనీ, తమ రాష్ట్రాన్ని మొదటి నుంచీ నిర్మించు కోవటాని కి మరింత సహాయం అందించాలనీ ఆయన అన్నారు. మొత్తానికి ఆంద్ర ప్రదేశ్ కి ఇక ప్యాకేజీ తప్ప ఏ హోదా లేనట్టే అన్నమాట