Home / Inspiring Stories / కాలితో బౌలింగ్…భుజంతో బ్యాటింగ్…!

కాలితో బౌలింగ్…భుజంతో బ్యాటింగ్…!

Author:

Amir-Hussain_-J-K-para-cricketer-_-Youtube1

కొందరి జీవితం మిగత జీవితాలకు ఒక హెచ్చరికగా కానీ, ఒక ఉదాహారణగా కాని ఉండాలి ఇందులో ఎలా ఉండాలో తెలుసుకొవలసింది మాత్రం మనమే అంటున్నాడు అమీర్‌ హుస్సేన్‌ లోన్‌. ఎందుకంటే ఒక్కప్పుడు తన చుట్టు ఉన్న జనం తనను బ్రతికి ఉన్న శవంతో పోల్చారు. కానీ ఇప్పుడు అదే జనం తన అద్భుత ప్రతిభతో నోరెళ్లబెట్టుకునేట్టు చేస్తున్నాడు.

క్రికెట్‌ అంటే ప్రపంచం మొత్తం ఇష్టపడుతుంది. కానీ ఇండియాలో ఉండే వారికి క్రికెటే ప్రపంచం అనే విషయం అందరికి తెలిసిందే, క్రికెట్ ని ప్రాణంగా భావించేవారిలో అమీర్‌ ఒక్కడు.అందులో క్రికెట్‌ దైవం అయిన సచిన్ అంటే భక్తి, తను కూడా ఒక క్రికెటర్ గా ఎదగలని అనుకున్నాడు అమీర్. కానీ విధి మరోలా తలచింది. 1997లో ఏడేళ్ల వయసులో తన సోదరుడికి భోజనం తీసుకుని వెళ్లాడు. బ్యాట్‌లు తయారు చేసే కోత యంత్రం వద్ద ఉన్న కొన్ని స్విచ్‌లను కదిలించసాగాడు. దీంతో కన్వేయర్‌ బెల్ట్‌లో రెండు చేతులు చిక్కుకుపోయాయి. అంతే రెండు చేతులూ కోల్పోయాడు. అంతే అమీర్ జీవితం ఒక్క సారిగా చికటి అయిపోయింది. ఎటుచూసిన అంధకారమైన జీవితం ఇరుగు పొరుగు వాళ్ళు తన తండ్రితో ఈ అబ్బాయి బ్రతికిన చచ్చిన శవంతో సమానం పేరిగే కొద్ది మీరు మీ అబ్బాయి ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది అందుకనే ఇప్పుడే వదిలించుకోడి అని చేప్పిన వారు చాలా మంది ఉన్నారు. కాని కొడుకు వైద్యం కోసం తన మిల్లు, వ్యవసాయ భూములను బషీర్‌ అమ్మెయల్సి వచ్చింది.కొడుకు ముందు తను సంపదించుకున్న ఆస్తి ఎక్కువ కాదు అనుకోని చాలా ఖర్చు చేసి పిల్లడిని బ్రతికించుకున్నాడు బషీర్‌.

అమీర్ కొద్దిగా కోలుకున్నకా తనకు తెలిసిన ఆట క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు కాని అది అంత సులువుగా కాదు ఎందుకంటే బ్యాట్ అయిన బంతి అయిన పట్టుకోవాలంటే మనకు చేయి ఉండాలి కానీ అమీర్ ఎంతో కష్టపడిన తర్వాత బ్యాట్‌ పట్టుకోవడం, కాలితో బంతిని పట్టుకుని వేయడం అలవాటు చేసుకున్నాడు.కాలితో రాయడం, స్నానం చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు షేవింగ్‌ కూడా తానే చేసుకునే స్థాయికి చేరుకున్నాడు.” సామర్థ్యం అనేది క్రమపద్దతిలో లభించే శిక్షణతో కలసి, ప్రావీణ్యంగా మారుతుంది. అత్యుత్తమంగా తయారవాలంటే ఇంకో మార్గం లేదు. సరైన ప్రాక్టిస్ చేయాడమే”. అలా చేస్తున్న కాలేజీ రోజుల్లో హుస్సేన్‌లో దాగున్న ప్రతిభను గుర్తించిన ఓ టీచర్‌.. అతడిని పారా టీమ్‌కు సిఫారసు చేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన అమీర్‌.. జమ్మూ కశ్మీర్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఎదిగాడు.

“ఇప్పుడు కష్టపడు, కానీ జీవితాంతం చాంపియన్ గా బ్రతుకు ” అనే నిజమైన అర్థానికి అర్థం చెప్పే విధంగా అమీర్ జీవితం ఒక గొప్ప ఉదాహారణ. అతను ఇంక మరెన్నో అద్బుతాలు సాధించాలని కోరుకుందాం.

(Visited 210 times, 1 visits today)