Home / Inspiring Stories / తన మాటలతో పాకిస్థాన్ ప్రధానికి ముచ్చెమటలు పట్టించిన మన అధికారి.

తన మాటలతో పాకిస్థాన్ ప్రధానికి ముచ్చెమటలు పట్టించిన మన అధికారి.

Author:

ఈ మధ్య జరిగిన ఐక్యరాజ్య సమితి వేదికలో పాకిస్తాన్ ని మూడు చెరువుల నీళ్లు తాగించింది మన ఐఎఫ్ఎస్ అధికారి ఈనామ్ గంభీర్. న్యూయార్క్ వేదికగా  జరిగిన ఐక్యరాజ్య సమితితో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, కాశ్మీర్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. కాశ్మీర్  లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతొందని పాక్ ప్రధాని ఆరోపించాడు. ఈ ప్రసంగంలో నవాజ్ కాశ్మీర్ అనే మాట 17 సార్లు ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో తమ దేశం చేస్తున్న పనిని సమర్దించే విధంగా ప్రయత్నించాడు.

పాక్ ప్రధాని ప్రసంగం వెంటానే భారత్ నుండి మన ప్రధాని మాట్లాడాలి కానీ అలాంటి వారికి మన అధికారి ఎవరైనా మాట్లాడిన సరిపోతుంది అనుకోని భారత్ తరుపున ఐక్యరాజసమితిలో సెక్రటరీగా పని చేస్తున్న ఈనామ్ కు ఈ ప్రసంగాన్ని అప్పజెప్పడం జరిగింది.

enam-gambhir1

పాక్ ప్రసంగం వెంటనే ఈనామ్ దాదాపు మూడు అంటే మూడు నిమిషాలలో తన ప్రసంగాన్ని ప్రస్తావించి పాక్ కి ముచ్చెమటలు పట్టించింది.
ఈ ప్రసంగంలో ఈనామ్ మాట్లాడుతూ… “ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా మారిన పాకిస్తాన్ మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యంగా ఉందని. ఇటీవలే జరిగిన ఉరి ఘటనలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దొంగ చాటుగా చొరబడి నిద్రిస్తున్న 18 మంది భారత జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. ఇలాంటి ఉగ్రవాదులను పాక్ పెంచిపోషిస్తుందని, అలాగే పాకిస్తాన్ అధిక నిధులు ప్రజలక సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా ఉగ్రవాదానికి వినియోగిస్తుందని  తీవ్రంగా ఖండించారు. అలాగే ప్రపంచంలో కరుడుకట్టిన ఉగ్రవాదులు అందరూ పాకిస్తాన్ లో తల దాచుకుంటే వారికి పాక్ రక్షణ కల్పించడంతో, ఉగ్రవాదులు రొమ్మువిరుచుకొని స్వేచ్ఛగా పాక్ విధుల్లో చిందులు వేస్తున్నారంటే  అది పాక్ ప్రోత్సాహామే. ప్రజలకు , ప్రజాస్వామ్యానికి రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం మనుషుల ప్రాణాలు తీసే ఉగ్రవాదులకు రక్షణ కలిపించడం ఏమిటి అని. మహిళలకు, మైనారిటీ వారిని అణిచివేస్తూ మానవహక్కుల ఉల్లంఘన పాక్ చేస్తుందని తన గంబీర స్వరంతో ధ్వజమెత్తారు ఈనామ్ గారు.

ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, వాటి విలువలకు కట్టుబడి ఉండే భారత్ పాకిస్తాన్ కి గాని ఉగ్రవాదానికి భయపడే ప్రసక్తే లేదని అలాగే కాశ్మీర్ మా దేశంలో భాగం అని, మా దేశంలో ఏ భాగంలో నైనా ఉగ్ర కార్యక్రమాలు జరపాలని చూసిన వాటిని తిప్పికొట్టే శక్తి మాకు ఉందని, ఇకనైనా పాక్ ప్రభుత్వం ప్రవృత్తిలో మార్పు వస్తే మంచిదని లేకుంటే వారు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

కేవలం ముందే నిమిషాలలో తాను చెప్పవల్సిన విషయాన్ని సూటిగా, గంభీరంగా చెప్పడంతో పాక్ ప్రతినిధులు చూస్తూ చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమి చేయలేకపోయారు . ఈ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. భారతీయులు అందరూ ఈనామ్ ని మెచ్చుకుంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

(Visited 6,573 times, 1 visits today)