Home / Inspiring Stories / చెన్నై కోసం కన్నీళ్ళు కాదు చెమట చుక్కలు రాల్చాడు.

చెన్నై కోసం కన్నీళ్ళు కాదు చెమట చుక్కలు రాల్చాడు.

Author:

Meet Peter Van Geit, A Savior For Chennai From Belgium

కష్టంలో వున్న వారిని ఆదుకోవటానికి దేశాలూ,జాతులూ,చర్మాల రంగులూ అక్కరలేదు. కేవల మనిషిని ఆదుకోగలిగేది ఇంకో మనిషే కదా..! ప్రపంచంలో ఎక్కడో మారుమూల ప్రాంతమైన యుగోస్లోవియాలో పుట్టిన మదర్ థెరిస్సా భారత దేశ అత్యున్నత పురస్కారమైన “భారత రత్న” గా మారటానికి కారణం సేవ. సాటి మనిషి మీద ఉన్న మమకారం,ఎదుటి మనిషి కష్టం లో ఉన్నప్పుడు అతని పట్ల చూపే చిన్న కరుణ… ఇవేకదా మనుషులని జంతువులనుంచి కాస్త వేరు చేసి చూపేది. కోట్లసంవత్సరాల మానవ ప్రస్తానం లో ఒకరికొకరి సహకారం,సహాయం లేకుంటే భూమి మీద అత్యంత శక్తివంతమైన ప్రాణి అయిన “మనిషి” మనుగడ ఎప్పుడో అంతమయ్యేది.లేదంటే ఇతర జీవులతో జరిగే మనుగడ పోరాటం లో అతనెక్కడో ఉండి ఉండే వాడు. “పక్కవాడి కి సాయం చేసేటంత సేపూ ఒక మనిషి దేవుడిగా మారిపోతాడూ” అనే ఒక జపాన్ సామెత. “మనిషిగా తనను తాను గుర్తించుకోవటానికి ఉన్న మొట్టమొదటి లక్షణం కరుణ” అన్న మదర్ థెరిస్సా మాటల్లో ఉన్న నిజాన్ని చూపించే వ్యక్తులు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. పీటర్ వ్యాన్ లా….

Meet Peter Van Geit, A Savior For Chennai From Belgium

పీటర్ వ్యాన్ గెయిట్ జన్మతహ బెల్జియం దేశస్తుడు.17 ఏళ్ళ క్రితం చెన్నైకి వచ్చిన ఈయన “చెన్నై ట్రెక్కింగ్ క్లబ్” ని స్థాపించి ఇక్కడే ఉండిపోయాడు.మొన్న చెన్నై వరదల్లో అతని క్లబ్ మెంబర్స్ తో కలిసి నిర్వహించిన రెస్క్యూ కార్యక్రమాలతో అందరి మన్ననలూ అందుకున్నాడు. అంతే కాదు వరదలు తగ్గు ముఖం పట్టగానే చెన్నై క్లీనింగ్ లో తానూ పాల్గొంటున్నాడి. ఏదీ చేయకుండా ఉండటం కంటే చేయి సాగినంత దూరం చేస్తూ పోవటమే అన్నట్టు గా అదీ ఇదీ అని కాదు. చెత్త సేకరించటం,రోడ్లు శుబ్రం చేయటం, డ్రైనేజీ సమస్యలున్న చోట సహాయం అందించటం ఇలా అదీ ఇదీ అని కాదు తనకు వీలైన ప్రతీ పనీ చేస్తూనే ఉన్నాడు.

Meet Peter Van Geit, A Savior For Chennai From Belgium

అయ్యో అంటూ టీవీల ముందు జాలిపడ్డ వాల్లూ,అదే చెన్నై లో మొన్నటివరకూ నరకయాతన పడీ తమ ఇళ్ళు కాస్త బాగుపడగానే తమ ఆఫీసులూ,తమ పనులకూ ప్రాధాన్యతనిస్తున్న మనలో చాలామందికంటే పీటర్ చూపించే దేశభక్తి ఖచ్చితంగా మెచ్చుకోదగ్గదే. తన దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాననీ ఇక్కడి మనుషులు తనకేమీ కారు అనీ అతను అనుకోలేదు. “ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భూమి మీదే కదా ఉన్నాయి,అంటే మనుషులంతా భూమికి చెందిన వారనే కదా అర్థం అందుకే నా సాటి భూలోక వాసులతో పాటు వారి కష్టాన్ని పంచుకుంటున్నాను” అంటూనే తన బురద చేతులతో చెత్త రిక్షాని లాక్కు పోతున్న పీటర్ మన వాడు కాదనీ,అతనొక విదేశీయుడనీ ఎలా అనగలం? ఔను…! పీటర్ చెప్పినట్టు మనమంతా దేశాలు గా విడిపోయిన ఒకే ప్రపంచానికి చెందిన వాళ్ళం… మాకో పాఠం నేర్పిన మిస్టర్ పీటర్ భారతీయులందరి తరపునా సలాం.

Meet Peter Van Geit, A Savior For Chennai From Belgium

(Visited 168 times, 1 visits today)