Home / Inspiring Stories / 118 ఆవిష్కారాల ఇంజినీర్ ఈ ఇండియన్ ఎడిసన్.

118 ఆవిష్కారాల ఇంజినీర్ ఈ ఇండియన్ ఎడిసన్.

Author:

 

Uddhab-Bharali-from-Assam-has-invented-over-100-engineering-devices.

మానవావసరాలకోసం 100కు పైగా ఆవిష్కరణలు చేసిన ఎడిసన్ మహాశయుని గురించి మనకు తెలుసు మరి మనదేశం లోనే ఉన్న ఈ ఎడిసన్ గురించి వీన్నరా..? ఉద్ధబ్ భరాలీ ఉత్తర లఖింపూర్, అస్సాం నివాసి. అతని పనేమిటంటే కొత్త వస్తువులని తయారు చేయటం. ఇతను తెలిసిన వారంతా ముద్దుగా “క్రియేటర్” అని పిలుచుకుంటారు . ఇది 1980 నుండి ఇప్పటి వరకూ ఈయన చేసిన ఆవిష్కరణలెన్నొ తెలుసా..!? అక్షరాలా 118. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న వస్తువులు తయారు చేసే అలవాటున్న ఉద్దవ్ 1988 వరకూ దాన్ని పూర్థి స్థాయి వృత్తిగా తీసుకోలేదు తన సొంత వ్యాపారం చూసుకుంటూనే ఉండేవాడు.

అవసరం కొత్త ఆవిష్కరణకు నాందీ అన్న సూక్తి ఉద్దవ్ విషయంలో నిజమైంది.1988 లో వ్యాపారం లో నష్టం వచ్చి ఉద్దవ్ కుటుంబం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయింది. సొంతంగా పాలిథిన్ మేకింగ్ పరిశ్రమని స్థాపించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు కానీ ఆ యంత్రాన్ని కొనాలంటే మార్కెట్ ధర లక్షకు పైనే ఉందని తేలింది. అప్పుడున్న పరిస్థితుల్లో అంతడబ్బు తనదగ్గర లేకపోవటం తో ఏం చేయాలో తెలియని సంధిగ్దం లో ఉన్న ఉద్దవ్ కి తను చూసిన పాలిథిన్ మేకింగ్ మిషన్ ని తనే తయారు చేసుకుంటే? అన్న ఆలోచన వచ్చింది దాంతో అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఆ యంత్రాన్ని తయారు చేయటం మొదలు పెట్టాడు. 76వేలల్లో నే ఒక యంత్రాన్ని సొంతంగా తయారు చేసేసాడు కూడా…

Uddhab-Bharali-from-Assam-has-invented-over-100-engineering-devices.

ఇక అక్కడి నుంచీ అతనిలో కొత్త ఆలోచన మొదలైంది కొత్తగా పనికి వచ్చేయంత్రాలు అవి కూడా నిత్య జీవితంలో ఉండే చిన్న చిన్న ఆవసరాల కోసం చౌకగా ఉండేలా తయారు చేయటం ప్రారంబించాడు. వెదురుని ప్రాసెస్ చేసే యంత్రం,పళ్ళరసం తీసే యంత్రం,విత్తనాలను వేరు చేయటానికి సులువుగా ఉండే పరికరం ఇలా ఉదాహరణకు ఒక పోకచెక్కలను వలిచేయంతర్మ్. మామూలుగా పోక వక్కలని ప్రాసేస్ చేసేటప్పుడు వేళ్ళు కోసుకోపోవటం ఉండేది అంతే కాదు ఒక మనిషి గంటలో ఒలిచే కాయల సంఖ్య 100 నుండీ 120 వరకూ పెరిగింది. ఇది లోకల్ రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది.ఇది అక్కడి అస్సాం కుటీర పరిశ్రమల్లోనే ఒక విప్లవానికే దారి తీసింది.

Uddhab-Bharali-from-Assam-has-invented-over-100-engineering-devices.

దీంతో ఉద్దవ్ హీరో ఐపోయాడు మీడియా ద్వారా 1995 లో వెలుగులోకి వచ్చినతర్వాత అతని ప్రోడక్ట్ లకి మరింత గుర్తింపు వచ్చింది.2007బ్ లో సృష్టి సమ్మాన్ అవార్డు వచ్చింది, 2009 లో రాష్త్రపతి కిందిస్థాయి ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది, ఇక ఆతర్వాత లోకల్ గా మరికిన్ని గుర్తింపులూ,సత్కారాలూ వీటిమద్యే మరిన్ని కొత్త వస్తువుల తయరీ ఇల్లా సాగిపోతూనే ఉనండౌ ఉద్దవ్, 2013 లో అతను ఎంట్రప్రెన్యూర్షిప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ స్కాలర్ గా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), గౌహతి వద్ద సాంకేతిక అభివృద్ధి రూరల్ టెక్నాలజీ ఏక్షన్ గ్రూపు (RUTAG) ఒక టెక్నికల్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు కూడా.

(Visited 441 times, 1 visits today)