Home / Entertainment / మెగా హీరోయిన్ నిహారిక మెగా షాక్ ఇచ్చింది.

మెగా హీరోయిన్ నిహారిక మెగా షాక్ ఇచ్చింది.

Author:

Niharika Konidela

నిహారిక మెగా కుటుంబం నుండి మొదటి లేడిగా మొదటగా బుల్లి తెర పైకి వచ్చింది ‘ఢీ’ ప్రోగ్రంలో దుమ్ము దులుపింది. ‘ఢీ’ లో రెండు సీరిస్ లకు యాంకర్ గా మంచి పేరు సంపాదించింది. మెళ్లిగా వెండితెర వైపు అడుగులు వేస్తు మొదటి చిత్రంగా ఒక మనసు చిత్రాన్ని మొదలు పెట్టింది. రామరాజు దర్శకత్వం వహిస్తున్న ‘ఒక మనసు’ చిత్రానికి మధుర శ్రీధర్ నిర్మాత. అయితే మెగా ఫ్యామిలీ నుండి వచ్చింది కదా గ్లామర్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని అభిమానులు అనుకున్న అందరికి షాక్ ఇస్తూ ఈ భామ ‘ఒక మనసు’ చిత్రంలో కాస్త గ్లామర్ ని ఒలకబోస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ మెగా హీరోయిన్ తన అందాలతో అభిమానులకు కనువిందు చేయబోతుంది. ఈ సినిమా షూట్ లో ఉన్నపుడు నిహారిక ఒక షాట్ తో థైస్ కనిపించేలా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మొదటి చిత్రంతోనే ఇలా గ్లామర్ పాత్రల్లో నటిస్తే రానున్న చిత్రాల్లో ఈ మెగా హీరోయిన్ ఎంత పని చేస్తుందో అని కాస్త కంగారుపడుతున్నారు. ఇక త్వరలో ఈ మెగా హీరోయిన్ తన అందాలతో అభిమానులకు కనువిందు చేయబోతుందని అర్ధమవుతుంది.

(Visited 162 times, 1 visits today)