Home / Entertainment / ఈ నెల 20న జైలుకి వెళ్లనున్న చిరంజీవి.

ఈ నెల 20న జైలుకి వెళ్లనున్న చిరంజీవి.

Author:

మెగా స్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకోనున్నారు. తన 150వ చిత్రం కత్తిలాంటోడు ఈ నెల రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే, అలాగే మెగా తనయుడు రామ్ చరణ్ తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Chiranajeevi-150-updates.

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ జైలు సెట్ లో ఈ నెల 20 నుండి  షూటింగ్ జరుగనుంది . ఈ సెట్ సినిమాలో కీలకమైనదిగా భావిస్తూ, ఈ సెట్‌ ని ప్రఖ్యాత కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో రూపొందించారు.. ఇప్పటికే ఈ క్రేజీ సినిమాలో రత్నవేలు, దేవీ శ్రీ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులు భాగం ఉండటం ఈ సినిమాపై  అప్పుడే  చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే రోజుకు ఒక పేరు వినిపిస్తుంది కాని ఇంత వరకు ఎవరిని ఫైనల్ చేయలేదని చిత్ర యూనిట్ తెలియజేసింది.

(Visited 2,382 times, 1 visits today)