Home / Entertainment / మీలో ఎవరు కోటీశ్వరుడు అంటున్న మెగాస్టార్

మీలో ఎవరు కోటీశ్వరుడు అంటున్న మెగాస్టార్

Author:

మొన్నటి వరకు తన రాజకీయ పనులతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఒక్కసారిగా వాటిని పక్కకు పెట్టి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎనిమిది సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకున్నారు. ఇక వరుసగా సినిమాలుచేస్తా అని తన 150వ సినిమా ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. మెగాస్టార్ 150వ చిత్రం ఇప్పుడు పూర్తీ కావచ్చింది. ఇక తదుపరి ఏమిటి అని అనుకునేలోపే మరో విషయంతో మన ముందుకు రాబోతున్నారు. ఇంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మన ముందుకు వచ్చిన నాగార్జున తన మంచి మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. అందులో చిన్న బ్రేక్ తీసుకొండి చిటికెలో వస్తా అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ వంతు వచ్చింది.

chiranjeevi-hosting-meelo-evaru-kotishwarulu-program

ఇన్ని రోజులు వెండితెర మీద తన నటనతో అందరి అలరించి ఒక మామూలు వ్యక్తి నుండి  మెగా స్టార్ గా ఎదిగాడు. ఇంత వరకు ఎప్పుడు బుల్లితెరలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయని చిరంజీవి మొదటి సారిగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ నెల 11 వ తేదీ నుండి ఈ ప్రోగ్రామ్ లో పాలుగోనేవారికి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఇక మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 12 వ తేదీ నుండి బుల్లితెర అయినా మాటీవీలో రానుంది. దీనికి సంబంధించిన ఒక టీజర్ మాటివి రిలీజ్ చేసింది… ఇందులో ” వెండి తెర పై నన్ను గెలిపించారు… బుల్లితెర పై మిమ్మల్ని గెలిపించేందుకు వస్తున్నాను, కమాన్ లెట్స్ ఫ్లే ” అంటూ మెగాస్టార్ పలికి ప్రేక్షకులకు ఆనందంలో నింపాడు.

(Visited 337 times, 1 visits today)