Home / Entertainment / 2.ఓ ద్వారా శంకర్ ఇచ్చిన సందేశం ఇదే…! ఓ స్వీట్ వార్నింగ్.!!

2.ఓ ద్వారా శంకర్ ఇచ్చిన సందేశం ఇదే…! ఓ స్వీట్ వార్నింగ్.!!

Author:

సినిమాలో కమర్షియల్ వాల్యూస్ ని మాత్రమే కాకుండా సందేశాలు కూడా ఇవ్వడం అంటే శంకర్ కె సాధ్యం. భారీ బడ్జెట్ చిత్రం ద్వారా ప్రపంచానికి ఓ సందేశం అందించడం మాత్రమే కాదు ప్రపంచానికి ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు శంకర్. రజినీకాంత్, అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన 2 ఓ చిత్రం నిన్న విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది.

source: google

ప్రపంచంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. కానీ మనుషుల అవసరాలకు ఇతర జీవాల ప్రాణాలు పణంగా పెడుతున్నారు.ప్రపంచానికి మనుషులు జీవన విధానానికి పక్షులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శంకర్ చెప్పిన విధానం ప్రశసించాల్సిన విషయం. ఈ సందేశం ఇవ్వడంకోసం పక్షిరాజా పాత్రను రూపొందించారు శంకర్.

పక్షిరాజా పాత్రకు తనవంతు న్యాయం చేసారు అక్షయ్ కుమార్. ఫస్ట్ హాఫ్ లో సెల్ ఫోన్స్ ని మాయం చేసిన కాకిగా భయపెట్టారు..సెకండ్ హాఫ్ లో పక్షులను ప్రేమించే పక్షిరాజాగా ఎమోషన్ పండించారు. సినిమా మొత్తం పక్షిరాజా చెప్పిన మాట ఒక్కటే…సేవ్ బర్డ్స్. స్టాప్ సెల్ ఫోన్స్.

Source: Akshay Facebook

పచ్చగా ఉండే ప్రకృతిని పురుగులు నాశనం చేస్తాయి. వాటిని అదుపుచేయడానికి పక్షులు వాటిని తింటాయి. ఇక కొన్ని రకాలపక్షులు వాతావరణంలో మార్పులు తెస్తాయని వర్షాలు కురవడానికి కారణం. అయితే పక్షులు కేవలం అధిక రేడియేషన్ కారణంగా చనిపోతుండడం మానవాళికి ఎంత ప్రమోదమో చెప్పకనే చెప్పాడు. మొబైల్స్ వాడకంలో పక్షుల రక్తపు బొట్టు ఉందని అవి అంతమైతే మానవాళి మనుగడం మరింత ప్రమాదమని హెచ్చరించాడు.

ఈ ప్రపంచంలో ఓ ముప్పై గ్రాముల పిచుక కూడా బతకలేకుంటే మన టెక్నాలజీ ఎందుకు అనేదే శంకర్ సందేశం. సెల్ ఫోన్ వినియోగదారుల సౌకర్యం కోసం రేంజ్ కి మించి ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపిస్తున్నారు సెల్ ఫోన్ కంపెనీలు. అవి అదుపు చేయాలనేది ఈ సినిమా ద్వారా శంకర్ ఇచ్చిన సందేశం.

(Visited 1 times, 1 visits today)