Home / Political / మంత్రికుమారుడికి కటకటాలేనా?

మంత్రికుమారుడికి కటకటాలేనా?

Author:

ravela susheel arrested

అధికారం చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ఏ తప్పు చేసినా అడిగే వాడుండడు… ఇదే గర్వం తో కీచకుల్లా మారుతున్నారు. డబ్బూ, అధికారం తో తప్పులు చేసి తప్పించుకుంటున్నారు. ఏ ఆరోపనలు వచ్చినా సినిమా డైలాగుల్లా “ఇది ప్రతిపక్షాల కుట్ర” అనో “చట్టం తన పని తాను చేసుకు పోతుంది” అంటూనో తప్పించుకు తిరుగుతున్నారు.

అయితే అన్ని సార్లూ అది కుదరదు తప్పించుకోవటం అంత సులభం కాదు కూడా. ఆంద్ర ప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడి కేసు అదే నిరూపించబోతోందా? చేసిన సిగ్గుమాలిన పనిని “కుక్కపిల్ల మీద జాలితో కారాపితే నన్ను అనవసరంగా ఇరికించారు” అంటూ జీవకారుణ్య కథ చెప్తూన్న సుశీల్ బాబు కి శిక్ష పడకుండా తప్పేలాలేదు. లేడీ టీచర్ చేయి పట్టుకుని లాగిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయయుడు రావెల సుశీల్ (24), అతని కారు డ్రైవర్ రమేష్ పోలీసులకు లొంగిపోయారు. శనివారం అర్థరాత్రి వారిద్దరు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు లొంగిపోయారు. స్టేషన్ బెయిల్ కోసం సుశీల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు. నిందితులిద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం వారిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సుశీల్, రమేష్‌లపై పోలీసులు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత అప్పారావు పేరు మీద కేసు నమోదు చేశారు. అసలు నిందితుడిని వదిలేస్తున్నారని టీచర్ మీడియాను ఆశ్రయించడంతో సుశీల్‌పై కూడా ఈవ్ టీజింగ్ కింద, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారి అరెస్టుకు శనివారంనాడు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.

నిందితులు సుశీల్, అప్పారావులకు సిఆర్‌పిఎఫ్ 41(ఎ) కింద జారీ చేసిన నోటీసులు అందుకోవడానికి మంత్రి కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. దాంతో మంత్రి రావెల కిశోర్ బాబు వ్యక్తిగత కార్యదర్శికి నోటీసులు అందించారు. విచారణ నిమిత్తం రెండు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని, గడువులోగా హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, సుశీల్ డ్రైవర్ పేరు అప్పారావు కాదని, రమేష్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా, మంత్రి కిశోర్ బాబు బంజారాహిల్స్ ఎసిపి ఉదయ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తన కుమారుడు సుశీల్‌ను సోమవారం నాడు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. చివరకు శనివారం రాత్రి సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రావెల సుశీల్ లొంగిపోయాడు.

మొదట్లో కేసు నుంచి తప్పించుకోవాలనుకున్న సుశీల్ బాబు చక్కటి కథని చెప్పి తప్పించుకోబోయాడు. కుక్క అడ్డం రావడం వల్ల దాన్ని రక్షించే ప్రయత్నం చేశామని, ఈ సమయంలో ఓ యువతి వచ్చి గొడవకు దిగిందని రావెల సుశీల్ చెప్పాడు. తనపై వచ్చిన ఆరోపణలు కుట్రపూరితమైనవని అన్నారు. అయితే, సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే సుశీల్ చెప్పిన విషయంలో అంతగా నిజం లేదని తెలుస్తోంది. సుశీల్ కారు అర కిలోమీటరు మేర యువతిని వెంటాడుతున్న దృశ్యం సిసి కెమెరాల్లో రికార్డయింది. తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో మహిళా టీచర్‌ను రావెల సుశీల్ కారు వెంబడిస్తున్న దృశ్యం ప్రసారమైంది. కారు వెంట పడుతుంటే యువతి పక్కకు జరిగి పోతుండడం కూడా కనిపించింది. అయితే, కుక్క పిల్ల కారుకు అడ్డం వచ్చినట్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో సుశీల్, ఆయన డ్రైవర్ కారు దిగిన దృశ్యాలు కూడా ప్రసారం కాలేదు.

కాగా, ఈ నెల 3వ తేదీ సాయంత్రం 3.45 గంటల సమయంలో కారు యువతిని వెంబడించిన దృశ్యం రికార్డయింది. రావెల సుశీల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడని, రమేష్ పక్కన కూర్చున్నాడని అంటున్నారు. వారిద్దరు కారు దిగి యువతిని అడ్డగించారని, చేతికి టాటూ వేసుకున్న వ్యక్తి తన చేయి పట్టుకుని లాగాడని మహిళా టీచర్ చెబుతోంది. తన చేయి పట్టుకుని లాగిన వ్యక్తి తనకు ఎవరో తెలియదని చెప్పారు. అయితే, చేతికి టాటూ వేయించుకున్న వ్యక్తే తనను చేయి పట్టుకుని లాగాడని ఆమె గుర్తించింది. తనను అడ్డగించి కారులో కూర్చోవాలని కూడా వారు బలవంతపెట్టారని మహిళ ఆరోపించింది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఇదే విశయాన్ని మంత్రి కిషోర్ బాబుని అడగగా ఎప్పటి మాదిరే కొడుకు కేసుపై స్పందించారు మంత్రి రావెల. తను కొడుకుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ కేసు విషయంలో తాను కలిగించుకోనన్న మంత్రి…పోలీసుల దర్యాప్తు తరువాత నిజా నిజాలు బయటకి వస్తాయన్నారు. తనతో పాటు, తనకి సంబంధిన వారెవరు ఈ విషయంలో కలిగించుకోబోమని చెప్పారు. చట్టంపై పూర్తి నమ్మకముందన్న ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

ఇదంతా జగన్, ప్రతిపక్షాల కుట్ర అంటూన్న నాయకులు తమకు మహిళలంటే గౌరవం ఉందనీ, ఇదంతా కావాలని చేస్తున్న ఆరోపణలే అంటున్నారు కానీ “వెళ్ళి ముద్దు పెట్టాలి, కడుపు చెయ్యాలి అన్న బాలకృష్ణ, రోజాకు అన్నీ జారిపోయాక…. అంటూ మాట్లాడిన ఆనం, ఐరన్ లెగ్ ఆంటీలు అంటూ అసభ్యకర వ్యాఖ్య లుచేసిన బోండాం ఉమా..ఇలా మాట్లాడిన వాళ్ళంతా టీడీపీ నాయకులే మరి వీటి వెనక ఎవరి కుట్ర ఉందని అంటారో ఈ నేతలంతా…

(Visited 249 times, 1 visits today)