Home / Videos / మిస్ యూనివర్స్ మిస్సయ్యింది కానీ ఆమే గెలిచింది.

మిస్ యూనివర్స్ మిస్సయ్యింది కానీ ఆమే గెలిచింది.

Author:

కొన్ని పొరపాట్లు మరీ తీసిపడేసే విధంగా ఉండవు. విపరీతమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి మిస్ యూనివర్స్ పోటీల్లో నిర్వాహకుల పొరపాటు అలాంటి సంధర్బాన్నే సృష్టించింది.ఈ సంవత్సరానికి గానూ డిసెంబర్ ఆదివారం రాత్రి మిస్ యూనివర్స్ అవార్డు ప్రకటించారు. రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన వేదిక మీద మిస్ యూనివర్స్ టైటిల్ ప్రధానం చెయ్యడానికి సర్వం సిద్దం అయ్యింది. చివరిగా పోటీలో అమెరికా, ఫిలిపైన్స్, కొలంబియా దేశాలకు చెందిన ముగ్గురు యువతులు తుదిపోటిలో నిలిచారు. ఆ ముగ్గురు ముగ్గురు యువతులతో పాటు అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎవరు విజేత అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొలంబియా యువతి గుటిరేజ్ మిస్ యూనివర్స్ అని ప్రకటించేశారు నిర్వాహకులు.అంతే గుటిరేజ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.విశ్వ సుందరిగా ఎంపికయ్యానన్న ఆనందం ఉక్కిరి బిక్కిరి చేస్తూండగా నిర్వహకులు గుటిరేజ్ తలపై మిస్ యూనివర్స్ కిరీటాన్ని పెట్టారు. జీవితం లోనే ఉద్వేగ భరిత క్సణాలవి.ఆ ఒక్క క్షణం కోసం కొన్ని సంవత్సరాల పాటు కషట పడిందామె.పట్టరాని సంతోషం లో మునిగిపోతూ మురిసిపోయిందా అమ్మాయి. తాను మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నాన్న్ ఆనందం తో కళ్ళలో నీళ్ళొచ్చేసాయి అంతే అంతలోనే నిర్వహకులు పెద్ద షాక్ ఇచ్చారు. “వి ఆర్ రియల్లీ సారీ” అంటూ గుటిరేజ్ కు చెప్పారు. ఎందుకంటే మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది గుటిరేజ్ కాదు ఫిలిఫ్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అనే అమ్మాయి పొరపాటున నిర్వాహకులు గుటిరేజ్ పేరు చెప్పారు. అంతే గుటిరేజ్ సంతోషం ఆవిరిఅయిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకూంటుండగానే ఆమె కలల కిరీటం నిమిషం కూడా గడవక ముందే జారిపోయింది.

ఆమె తల మీద ఉన్న కిరీటం వెనక్కి తీసుకుని ఉర్జ్ బ్యాక్ తల మీద పెట్టారు. కానీ హాజరైన వారికి మాత్రం గుటిరేజ్ కు జరిగిన అవమానం భాదకలిగించింది. జరిగింది పొరపాటే కావొచ్చు. కానీ అందాల పోటీలకు వచ్చే అభ్యర్థిణులు అదే తమ జీవితాశయం అన్నంత గా కష్టపడతారు.అన్ని వేల మందిముందు గుటిరేజ్ నే విజేత అనిచెప్పి కిరీటం పెట్టాక “సారీ” అని చెప్పటం వల్ల కలిగే భాద మాటల్లో చెప్పలేనిది. నిర్వహకుల తప్పిదంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఐతే ఈ విషయంపై కిరీటం చేజారిపోయిన గుటిరేజ్ మాత్రం ఎంతో హుందాగా ప్రవర్తించించింది. వేదిక మీదే తన తల మీద కిరీటాన్ని పొందిన ఉర్జ్ బ్యాక్ ని అభినందించటమే కాదు మీడియాతో కూడా నిర్వాహకులు కావాలని ఇలా చెయ్యలేదని, అనుకోకుండా పొరపాటు జరిగిందని దాని పట్ల తనకు ఎవరిమీదా కోపం రావట్లేదని చెప్పి రెండోసారి తనెంత అందమైందో నిరూపించుకుంది.

(Visited 1,305 times, 1 visits today)