Home / Inspiring Stories / ఫోన్ నీళ్లలో పడిందా..? అయితే ఇలా చేయండి..!

ఫోన్ నీళ్లలో పడిందా..? అయితే ఇలా చేయండి..!

Author:

ఎన్నో వేలు పెట్టి ఇష్టపడి కొన్న మొబైల్ దురదుష్టావశాత్తు నీటిలో పడితే వెంటనే పాడైపోతుంది. మొబైల్ కంపెనీ అది కొత్త మొబైల్ అయినా సరే, మొబైల్ కంపెనీ వారు నీటిలో పడితే ఎలాంటి చర్య తీసుకోలేరు. యువత మొబైల్ విడిచి ఒక్క సెకండ్ కూడా ఉండలేని రోజులు ఇవి. బాత్రూమ్ లోకి సైతం మొబైల్ తీసుకెళ్తున్నారు ఈనాటి జనాలు, పొరపాటున మొబైల్ జారీ టాయిలెట్స్ లో గాని, వాటర్ బకెట్ లో గాని, పడినప్పుడు లేదా మారే విధంగా అయినా మొబైల్ తడిసినపుడు ఈ క్రింది జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటించి మీ మొబైల్ ని పాడు కాకుండా కాపాడుకోండి. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో కూడా మీకోసం ఇవ్వడం జరిగింది.

Mobile-Phone-Fallen-Into-Water ఫోన్ నీళ్లలో పడింది

  • నీటిలో పడ్డ ఫోన్ ను తీసిన వెంటనే ఆన్ చేయుటం మంచిది కాదు. ఫోన్ పై ఉండే బటన్స్ ఎట్టి పరిస్థితుల్లో నొక్కకపోవటం మంచిది.
  • ఫోన్ ఊపడం, విసరటం అస్సలు చేయకూడదు. మొబైల్ యొక్క భాగాలను ఇష్టం వచ్చినట్లుగా విడదీయకూడదు.
  • లోపలికి నీరు చేరిందేమో అని కంగారు పడి, నోటితో గట్టిగా గాలిని ఊదకూడదు. అలా చేయటం మూలంగా డివైస్ లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలకు నీరు చేరి మరింత డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది.
  • ఏ పద్ధతిలోను ఫోన్ నీ వేడి చేయకూడదు. ఉదా: ఎండ కి పెట్టడం, మంట దగ్గర పెట్టడం, etc…
  • నీటిలో పడిన తర్వాత కూడా ఫోన్ ఆన్ అయ్యే ఉంటే, వెంటనే ఆఫ్ చేయండి.
  • బ్యాక్ కవర్/కేస్, బ్యాటరీ, సిమ్ మరియు మెమొరీ కార్డు లను తీసేయాలి.
  • పొడి బట్టతో లేదా టిష్యు పేపర్ తో మొబైల్ ని తడి లేకుండా తుడవాలి.
  • బియ్యానికి నీటిని పీల్చేసే శక్తి బాగా ఉంటుంది. ఒక కవర్ లో బియ్యం తీసుకొని, అందులో ఫోన్ మరియు బ్యాటరీ పెట్టి పూర్తిగా బియ్యంతో కప్పేసి గాలి చేయకుండా కవర్ ని క్లోజ్ చేయాలి.
  • 24 గంటల తర్వాత మొబైల్ తీసి, తుడిచి బ్యాటరీ వేసి ఆన్ చేసి ఎప్పటిలాగే వాడుకోవచ్చు. ఒకవేళ మొబైల్ ఆన్ కాకపోతే మాత్రం ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూడాలి, అయినా ఆన్ కాకపోతే కొత్త బ్యాటరీ వేసి ప్రయత్నించాలి. ఒకవేళ అప్పుడు కూడా ఓ ఆన్ కాకపోతే, దగ్గర్లో ఉన్న సర్వీస్ సెంటర్ కి వెళ్లి చూపించటం మంచిది.

Must Read: మీ దగ్గర ఉన్న నోటు నకిలీదో..? కాదో..? ఈ తొమ్మిది గుర్తులతో చెప్పేయొచ్చు..!

(Visited 10,518 times, 1 visits today)