Home / General / మోడీ చెప్పిన అచ్చే దిన్ చైనాలో వచ్చాయి… మరి మనకో ?

మోడీ చెప్పిన అచ్చే దిన్ చైనాలో వచ్చాయి… మరి మనకో ?

Author:

నరేంద్ర మోడీ.. అధికారం లోకి రాగానే నల్ల ధనం మొత్తం బయటకు తీస్తానని, అప్పు ఎగ్గొట్టిన వాళ్లెవరైనా సరే… వసూలు చేసి తీరతాం అనీ, ఈ సొమ్మంతా భారత పేద ప్రజలకి అందిస్తాం అనీ, ఇక రానున్నవి అన్నీ అచ్చే దిన్ అని ప్రచారం చేయటం వల్లే ప్రధాని పీఠం ఎక్కారన్నది జగమెరిగిన సత్యం. కానీ, మోడీ ప్రధాని అయ్యాక అవేం జరగలేదు సరికదా.. నోట్ల రద్దు, ఏటీఎం లలో డబ్బు రాకపోవటం మొదలైనవి జరిగాయి. అందుకే ఒకసారి మోడీ గారు చైనా ప్రభుత్వాన్ని గమనించాలని కోరుకునేది.

china court

అసలు విషయమేమిటంటే, చైనాలో 67.3 లక్షల అప్పు ఎగ్గొట్టిన వాళ్ళందరి భరతం పట్టేసింది అక్కడి సుప్రీం పీపుల్స్ కోర్టు. అందరినీ బ్లాక్ లిస్టు చేసి పారేసింది. ఇక వాళ్ళు విమానాల్లో, రైల్లో ప్రయాణం చేయలేరు. వాళ్ళ క్రెడిట్ కార్డులన్నీ పనిచేయవు. ఎక్కడా ఇంకో రూపాయి అప్పు కూడా పుట్టదు. సూపర్ కదా. చైనా లో జరిగిన ఈ అద్భుతమైన తీర్పు గురించి గ్లోబల్ టైమ్స్ పత్రికలో వార్తలు వెలువడ్డాయి.

ఇప్పటికే చైనా ప్రభుత్వం 61.5లక్షల మందిని విమాన టికెట్లు కూడా కొనకుండా బ్లాక్ చేసింది. 22.2లక్షల మంది అసలు హై స్పీడ్ ట్రైన్లో కూడా ప్రయాణం చేయకుండా బ్లాక్ చేసి అడ్డు పడింది. ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? వారి పాస్ పోర్టులు, ఐడీ కార్డుల ద్వారా ఇవన్నీ అమలు చేస్తున్నట్టు సుప్రీం పీపుల్స్ కోర్టు ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ చెప్పారు. అంతే కాదు 71వేల మంది ఎగవేతదారులు ఇక ముందు ఏ కంపెనీలో కూడా కార్పోరేట్ కంపెనీ ప్రతినిధులు గా, ఎక్సిక్యూటివ్స్ గా పని చేయకుండా ఆదేశాలు జారి చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, కమిటీ సభ్యులు, లెజిస్లేటివ్ సభ్యులు, చైనా కమ్యునిస్ట్ పార్టీ కాంగ్రెస్ డెలిగేట్స్… ఇలా ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని కోర్టు ఆదేశించింది. ఈ దెబ్బకి కొందరిని పదవుల నుంచి బహిష్కరించారు. ఇంకొ౦దరిని సస్పెండ్ చేసారు, ఇప్పటికే అందరూ బెదిరిపోయి రుణాలు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారట.

ఇలా మన దేశంలో కూడా అమలయితే, మన దేశం ప్రపంచం లోనే నంబర్ వన్ అవ్వడం ఖాయం. ఎందుకంటే… ఎక్కువ మంది అప్పు ఎగవేసిన ఘన చరిత్ర మన దేశానిదే కాబట్టి. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా లండన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే, సామాన్య ప్రజలేమో వాళ్ల టాక్సులు కూడా కలిపి కట్టుకుంటూ పోవడం జరుగుతుంది. ప్లీజ్ మోడీ సాబ్ జరా దేఖో.. హమే అసలీ అచ్చే దిన్ దిలావో.

 

(Visited 1,087 times, 1 visits today)