Home / Inspiring Stories / మోడీ తల్లి అయిన సరే లైన్ లో వచ్చి బ్యాంకులో డబ్బులు మార్చుకోవాల్సిందే…!

మోడీ తల్లి అయిన సరే లైన్ లో వచ్చి బ్యాంకులో డబ్బులు మార్చుకోవాల్సిందే…!

Author:

భారత్ లో పెరిగిపోయిన నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో యావత్ దేశ ప్రజలంతా ఇప్పుడు బ్యాంకుల ముందు, ఏటీయంల ముందు బారులు తీరారు. నడి వయసు నుండి మూడుకాళ్ళ ముసలి వారు కూడా లైన్లలో నిలుచుంటున్నారు. దీనికి ఎవరు అతీతులు కారు అని సాక్షాత్ దేశ ప్రధాని మోడీజీ తల్లి హీరా బెన్ కూడా స్వయంగా గుజరాత్ రాజధాని లోని గాంధీ నగర్ లో ఉన్న ఓరియంటల్ బ్యాంకుకు వెళ్లి తన వద్ద ఉన్న 4 వేల 500 రూపాయలు పాతవి ఇచ్చి, కొత్త నోట్లు తీసుకున్నారు.

bank-deposit

హీరా బెన్ 94 సంవత్సరాల వయసు కాబట్టి తన కుటుంబ, సహాయకుల సాయంతో బ్యాంకులో నోట్లు మార్చుకున్నారు. బ్యాంక్ నిబంధనల ప్రకారం ఫారం నింపి, వేలి ముద్ర వేశారు.. ఐడి ప్రూఫ్ జతచేసి బ్యాంక్ వారికి ఇచ్చారు. ఈ రోజు నుండి సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో నేరుగా కౌంటర్ దగ్గర దబ్బులు మార్చుకున్నారు. ఇలా 94 ఏళ్ల వయసున్న హీనా బెన్ స్వయంగా వచ్చి డబ్బులు మార్చుకోవడంతో మోడీ నల్లధనం పై చేస్తున్న పోరాటానికి తన తల్లి ఆశీస్సులు కూడా లభించినట్లే.

(Visited 918 times, 1 visits today)