Home / Entertainment / 40 ఇయర్స్ @ఇండస్ట్రీ-“నటప్రపూర్ణ”

40 ఇయర్స్ @ఇండస్ట్రీ-“నటప్రపూర్ణ”

Author:

mohanBabu

“నటప్రపూర్ణ” (పూర్తి నటుడు), “డైలాగ్ కింగ్” మరియు “కల్లెక్షన్ కింగ్” మోహన్ బాబు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్‌ అనే ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది ఆ పాత్ర పేరును తనకు దాసరి గారు మోహన్ బాబు గా నామకరణం చేశాడు.

తన విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ పరిమశ్రమలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు. నేటితో తన సినీ ప్రయాణంలో నలభై వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. 1975 నవంబర్ 22న విడుదలైన ‘స్వర్గం-నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో 520కి పైగా సినిమాల్లో నటించి తనదైన బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు.

ఇక మొదట్లో విలన్ తరహా పాత్రలు పోషించి, ఆ తర్వాత హీరోగా ప్రభంజనం సృష్టించిన మోహన్ బాబు, నిర్మాతగానూ 50కి పైగా సినిమాలను నిర్మించి, సినీ నిర్మాణంలోనూ సంచలనం సృష్టించారు. అదేవిధంగా విద్యారంగంలోనూ శ్రీ విద్యానికేతన్ తరపున ఎన్నో సేవలు అందిస్తూ వెళుతోన్న మోహన్ బాబును భారత ప్రభుత్వం రాష్ట్రపతి చేతులమీదుగా 2007లో ప్రఖ్యాత జాతీయ పురష్కారం పద్మశ్రీ ని ఇచ్చి సత్కరించిన విషయం తెలిసిందే. ఇక తన సినీ ప్రయాణంలో నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు ఫ్యామిలీ ప్రత్యేక వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, విక్టరీ వెంకటేష్, టి. సుబ్బిరామి రెడ్డి తదితరులు అతిథులుగా హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

(Visited 35 times, 1 visits today)