Home / Entertainment / కోతి చేతికి బస్సు స్టీరింగ్ … ఇచ్చి డ్రైవర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం

కోతి చేతికి బస్సు స్టీరింగ్ … ఇచ్చి డ్రైవర్ ప్రజల ప్రాణాలతో చెలగాటం

Author:

ఇటీవల కాలంలో దేశంలో ఏదో ఒక చోట ఆర్టీసీ బస్సు లు ప్రమదాలకు గురవుతున్న సంఘటనలను రోజూ మనం చూస్తూనే ఉన్నాం.ఈ ప్రమాదాల్లో ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే జరిగినవే.

ఇలాంటి నిర్లక్ష్యపూరిత సంఘటనే ఒకటి ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. కోతి చేతికి బస్సు స్టీరింగ్ ఇచ్చి డ్రైవర్ చూస్తూ కూర్చొన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేఎస్ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రకాష్ ఈ నెల 1న ప్రకాష్‌ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా.

monkey-drives-karnataka-bus

కోతి స్టీరింగ్‌ మీద కూర్చునప్పటికి డ్రైవర్‌ ప్రకాష్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా…కోతి స్టీరింగ్‌ తిప్పుతుంటే గేర్‌ మారుస్తూ వినోదం చూస్తున్నాడు. ఇదంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. బస్సు డ్రైవర్‌ ప్రకాష్ ని అధికారులు సస్పెండ్‌ చేశారు.

(Visited 1 times, 1 visits today)