Home / Political / ఢిల్లీ వాసుల నుండి కోట్లు కొల్లగొడుతున్న కోతుల మాఫియా.

ఢిల్లీ వాసుల నుండి కోట్లు కొల్లగొడుతున్న కోతుల మాఫియా.

Author:

అడవుల్లో, గుట్టల్లో ఉండాల్సిన కోతులు మన గ్రామాలు, పట్టణాలలోకి చేరి కలిగిస్తున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, రైతుల పంటలను నాశనం చేస్తున్న ఈ కోతులు దేశ రాజధాని ఢిల్లీ పై కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. ఇక కోతుల బాధ పడలేక వాటిని ఎలాగైనా తరిమికొట్టాలన్న ఢిల్లీ వాసుల అవసరాన్ని గమనించిన క్రిమినల్ గ్యాంగులు అడవుల నుండి కొండెంగలను(కొండముచ్చు) అక్రమంగా పట్టుకొచ్చి, కోతులను తరిమికొట్టి డబ్బులు దండుకుంటున్నాయి. అదేంటీ కోతులను రాకుండా చెస్తే అందులో తప్పు ఎముంది అని మీరు అనుకుంటున్నారా? అందులోనే ఉంది అసలు తిరకాసు… కొండెంగలను పట్టుకొచ్చిన వారే ఒక ఏరియాలోని కోతులను ఇంకో ఏరియాలోకి పంపి మరల ఆ రెండో ఏరియాలోని వారి దగ్గరి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి వసూలు చేస్తే తప్పు లేదు కాని ప్రతి నెల మీ ఏరియాలోకి కోతులు రాకుండా ఉండాలంటే డబ్బులు కట్టాల్సిందే అని ప్రతినెల పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు, ఆసుపత్రులు, హోటల్లు, విల్లాలు, కాలనీల వారి నుండి నెలకు 8000 నుండి 15,000 రూపాయల వరకు వసూలు చేసి కోట్లు గడిస్తున్నారు.

monkey mafia in delhi

కోతుల బెడద తట్టుకోలేక ప్రజలు కూడా ఆ కొండెంగల గ్యాంగులు అడిగినంతా ముట్టచెబుతున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలలోకి చేరిన ఈ వ్యాపారం కొండెంగల ప్రాణం మీదకు వచ్చిందని ఆరోపిస్తున్నారు జంతు ప్రేమికులు. భారతీయ చట్టాల ప్రకారం అడవిజాతి కొండెంగలను పెంచుకోవడం , బంధించడం చట్టరిత్యానేరం కాని డబ్బులకు ఆశపడ్డ క్రిమినల్ గ్యాంగులు అడవుల నుండి కొండెంగలను అక్రమంగా పట్టుకొచ్చి, కోతులను తరిమే గ్యాంగులకు అమ్ముతున్నారు. వారు వీటిని బంధించి కోతులు సంచరిస్తున్న ఏరియాలో తిప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. దీనివలన కొండెంగల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఢిల్లీ కి చెందిన జంతు ప్రేమికుడు అభినవ్ తెలిపారు.

(Visited 602 times, 1 visits today)