Home / Inspiring Stories / కొడుకు చనిపోయిన రెండున్నరేళ్లకు అతని గుండె చప్పుడు విన్న తల్లి

కొడుకు చనిపోయిన రెండున్నరేళ్లకు అతని గుండె చప్పుడు విన్న తల్లి

Author:

అమ్మా..! అని పిలవకుండానే ఒక చిన్నారి ఆ తల్లిని విడిచి వెళ్ళిపోయాడు. తన కడుపున పుట్టిన బిడ్డ రెండేళ్ళు కూడా నిండకుందానే నూరేళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు గుండెలు పగిలేలా రోదించిందామె. ఐతే అంతటి రోదనలోనూ తల్లి భాద్యత మరిచి పోలేదు. పెల్లుబుకుతున్న దుఃఖాన్ని అదిమిపెట్టుకొని తన కొడుకు గుండెని దానం చేసేందుకు ఒప్పుకుంది. మరో తల్లి కళ్ళలో ఆనందం నింపేందుకు తన ఏడూ నెలల కొడుకు చేసిన త్యాగాన్ని చూసుకొని మురిసిపోయింది…. అలా తన కొడుకుని మరో చిన్నారి శరీరంలో మరోసారి బతికించింది.

3

అమెరికాలోని అరిజొనా స్టేట్‌కి చెందిన 22 ఏళ్ళ క్లార్క్‌ తనకు పుట్టిన బిడ్డ లూకాస్ ని అపూరూపంగా చూసుకుంది. ముద్దులు మూటగట్టే చిన్నారి తనయుడు తన లోకం అనుకుంది.ఐతే ఉద్యోగస్తురాలు కావటంతో అరిజోనాలోనే ఉన్న ఒక బేబీ కేర్ సెంటర్ లో ఆ బిడ్డని వదిలి ఆఫీస్ కి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చుకునేది. కానీ ఒక రోజు సాయంత్రం ఆఫీస్ కి ఒక కాల్ వచ్చింది. అరిజోనా హాస్పిటల్ నుంచి. “మిసెస్ క్లార్క్ మీ పిల్లవాన్ని ఆసుపత్రిలో చేర్చాం మీరు అర్జెంట్ గా రండి.” తనతో మాట్లాడింది పోలీస్ ఆఫీసర్. అదిరే గుండెలతో హాస్పిటల్ కి వెళ్ళిన క్లార్క్ విషయం తెలిసి కుప్పకూలిపోయింది. రోజూ తను బేబీ కేర్ సెంటర్ లో తన బిడ్డని వదిలి వెళ్ళాక ఏం జరిగేదో… ఎన్ని సార్లు ఆ పిల్లవాడు నరక యాతన అనుభవించేవాడో, చిన్నారి దేహం తలకిందులుగా వేలాడబడటం,కాళ్ళూ చేతుల కీళ్ళ మీద దెబ్బకొట్టి ఆ నొప్పికి చిన్నారి గొంతు పగిలేలా ఏడ్చేవాడో ఆ పోలీసాఫీసర్ నోటివెంట విని గుండెలు బాదుకొని ఏడ్చింది.

2

“సారీ…! మిసెస్ క్లార్క్ మీరు బేబీ కేర్ సెంటర్ లో లూకాస్ ని ఇచ్చేసి వెళ్ళాక నిర్వాహకురాలి బాయ్ ఫ్రెండ్ వీళ్ళని చిత్రహింసలు పెట్టేవాడు. ఈ రోజు కూడా మీ పిల్లాడిపై కౄరంగా ప్రవర్తించటంతో స్పృహకోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకు వస్తే అనుమానం వచ్చి వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు. వాడిప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు.” జాన్ పెర్రీ అనే ఆ అధికారి మాటలు వింటూంటే లూకాస్ పడ్డ నరకమంతా కళ్ళ ముందు కదిలింది. కనీసం ఏడాదైనా నిండని ఒక పసివాడి నరక యాతన కి తల బాదుకుంటూ ఏడ్చింది… అప్పటికే మరో దెబ్బ…. లూకాస్ తలమీద కొట్టిన దెబ్బలు బలంగా తగలటంతో ఆ కుదుపులకి,తలకిందులుగా వేలాడదీయటం వల్లా.. అతని మెదడులో రక్తం గడ్డ కట్టింది ఇక అతను బతకటం అసాధ్యం. లూకాస్ ని బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు డాక్టర్లు.

4

మిసెస్ క్లార్క్…! మీబిడ్డ ఇక బతకడన్నది భాదాకరమే అయినా ఇప్పుడు ఈ విషయం మాట్లాడక తప్పదు. లూకాస్ ని మరో శరీరంలో మనం బతికించుకోవచ్చు. అతని అవయవాలని దానం చేయటం వల్ల మన లూకాస్ మరికొందరి ప్రాణాలను కాపాడిన వాడౌతాడు… చెప్పారు డాక్టర్లు. తన బిడ్డ ఇక లేడన్న విషయం గుండెలను మెలిపెడుతున్నా… ఆ చిన్నారి అవయవాలని దానం చేయటానికి ముందుకొచ్చిందా తల్లి. లూకాస్ శరీరం నుంచి అతని గుండే,కాలేయం, మూత్రపిండాలూ వేరుచేయబడ్దాయి. లూకాస్ శరీరం ఖననం చేయబడింది. అదే రోజు లూకాస్ గుండెని పుట్టుకతోనే గుండె సమస్యలతో మరణం చివరలో ఉన్న రెండేళ్ళ బాలికకి అమర్చారు. ఈ సంఘటన 2013 జూన్ లో జరిగింది. లూకా గుండెని వేరు చేసే ముందు అతని గుండె చప్పుడుని రికార్డ్ చేయించింది క్లార్క్. ఒక టెడ్డీ బేర్ లో ముసిక్ ప్లేయర్ ని పెట్టి దాన్లోంచి ఆ చప్పుడుని వింటూ గంటల కొద్దీ ఏడ్చేది.లూకాస్ ఫొటోని తన ముంజేతి మీద పచ్చబొట్టుగా వేయించుకుంది .

1

అలా రెండున్నరేళ్ళు గడిచిపోయాయి… పోయిన వారం ఆమెకి కాలిఫోర్నియా నుంచి ఒక కాల్ వచ్చింది. తన పేరు ఎస్తేర్ గొంజాలెజ్ అనీ,తాను లూకాస్ గుండె అమర్చబడ్డ అమ్మాయి తల్లిననీ… ఇప్పుడు క్లార్క్ ని కలవాలనుకుంటున్నాననీ చెప్పింది,సరే అని చెప్పింది క్లార్క్. ఈ వారాంతం లో వాళ్ళు కలుసుకున్నారు. పాపని దగ్గరికి తీసుకున్న క్లార్క్ అడిగింది “నీ పేరేమిటి?” “జోర్డాన్”చెప్పిందా పాప.. “నేనొక సారి నీ గుండె చప్పుడు వినొచ్చా”? “సరే..!” స్టెతస్కోప్ లో నుంచి లబ్..డబ్..లభ్..డబ్…ఆ గుండె చప్పుడు తన కొడుకు లూకాస్ గుండె చప్పుడే.. ఉద్వేగాన్నాపుకోలేక జారుతున్న కన్నీళ్ళని ఆపుకోలేకపోయింది… అలా వింటూనే ఉండిపోయింది.తన కొడుకు గుండె చప్పుడు ఉంచిన టెడ్డీ బేర్ ని జోర్డాన్ కి బహుమతిగా ఇచ్చింది. “ఏడవద్దు ఇప్పుడు జోర్దాన్ నా ఒక్క దానికే కాదు మనిద్దరి బిడ్డ కన్నది నేనైనా… చావు నుంచి తప్పించింది నీ బిడ్ద లూకాస్… నీ బిడ్డ ప్రాణాన్ని నా కూతురికిచ్చావు… ఇక నా ఒక్క దానికే ఎలా స్వంతం అనుకుంటాను” కన్నీళ్ళ తోనే చెప్పింది జోర్డాన్ తల్లి ఎస్తేర్.


“లూకాస్ ఒక డ్రీం చైల్డ్ అందుకే ఒక కలలా నా జీవితం లోకి వచ్చివెళ్ళిపోయాడు. ఐతే..! వాడి ఙ్ఞాపకంగా తన గుండెనే ఇచ్చి వెళ్ళాడు” ఒక మీడియా ప్రతినిధితో చెప్పింది హీథెర్ క్లార్ అనే ఆ అమ్మ….

(Visited 3,201 times, 1 visits today)