Home / Inspiring Stories / ముగ్గురు,నలుగురు చేస్తేనే గ్యాంగ్ రేప్ అవుతుందంటున్న కర్ణాటక హోమ్ మినిస్టర్.

ముగ్గురు,నలుగురు చేస్తేనే గ్యాంగ్ రేప్ అవుతుందంటున్న కర్ణాటక హోమ్ మినిస్టర్.

Author:

పుర్రెకో బుద్ధి ..మనిషికో రకం అని ఒక సామెత….ఆ సామెత సంగతి పక్కన పెడితే, పెద్ద త్రోవ పడుతున్న ఆలోచనా ధోరణులకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి కె.జె. జార్జ్. సామూహిక అత్యాచారమనే మాటకు కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేయటం ద్వారా ఆయన అనవసరమైన సంచలానికి తెర తీశారు. ఇద్దరు మగవారు అత్యాచారానికి పాల్పడితే, అది సామూహిక అత్యాచారం కిందకు రాదంటూ ఆయన కొత్త డెఫినిషన్ ఇచ్చారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర హోం శాఖా మంత్రే ఈ రకంగా మాట్లాడితే, ఇహ నాగరిక జనానికి చట్టం మీద, న్యాయం మీద ఏం నమ్మకం కలుగుతుంది? ఇద్దరికి మించి మగవారు అత్యాచారం లో పాల్గొననప్పుడు, దానిని సామూహిక అత్యాచారం కేటగిరీ లోకి ఎలా తీసుకువస్తారంటూ ఆయన సభ్య సమాజానికి సంధించిన ప్రశ్న ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక టెంపో ట్రావెలర్ లో ప్రయాణిస్తున్న ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని పై జరిగిన అత్యాచారం పై ప్రశ్న అడిగితే, హోమ్ మినిస్టర్ జార్జ్ నుంచి వచ్చిన సమాధానమిది. ఇద్దరు రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎలా అవుతుంది…..కనీసం ముగ్గురు,నలుగురు ఇన్ వాల్వ్ అయితే కానీ దాన్ని గ్యాంగ్ రేప్ గా పరిగణించలేమంటూ జార్జ్ విశ్లేషించారు. ఆయన లెక్కల ప్రకారం గ్యాంగ్ రేప్ చేయాలంటే..కనీసం ముగ్గురు లేదా నలుగురు కావాలట! ఐ టి క్యాపిటల్ బెంగళూరు లో జరిగిన కాల్ సెంటర్ ఉద్యోగిని అత్యాచారం ఘటనపై విపక్షాల దాడిని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా, బెంగళూరు పోలీసులు –సునీల్ ఓంకారప్ప, యోగేశ్ మల్లేశప్ప అనే ఇద్దరు నిడితులను అరెస్ట్ చేశారు. గడిచిన మూడేళ్లుగా బెంగళూరులోనే ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వీరిద్దరి స్వస్థలం చిక్ మగళూరు జిల్లాలోని కడూర్ గ్రామం.

(Visited 50 times, 1 visits today)