Home / Inspiring Stories / నిజమైన తాలిబన్ నేను.

నిజమైన తాలిబన్ నేను.

Author:

Fighting Against ISIS and Pakisthan

ప్రపంచం మొత్తాన్ని తన ఉన్మాద చర్యలతో వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు చెమటలు పట్టించే మొనగాడు ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటగా వినిపించేది ముజాహిద్ పేరే. ఇతగాడు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి నానుతున్నాడు. తనకు తాను తాలిబన్ గా ప్రకటించుకునే ఆయన ఇతగాడి వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది.తన తెలుసుకునే వారికి కొత్తగా,కన్ఫ్యూజింగ్ కనిపిస్తాడు.

ముజాహిద్ తాలిబన్ అనే మాటకు అరబిక్ భాషలో జ్ఞానాన్ని అన్వేషించేవాడని చేప్పుతాడు. మొదట ముజాహిద్ ని అల్ ఖయిదా ఉగ్రవాదిగా భావించి అమెరికన్లు అతడ్ని జైల్లో పెట్టారు.కానీ అతగాడికి ఆల్ ఖైదాకు సంబంధం లేదన్న విషయాన్ని వికీలీక్స్ బయటపెట్టటంతో అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. అతగాడు జైలు నుంచి బయటకు వచ్చేస్తు ఇస్లామిక్ స్టేట్ తోపాటు పాక్ కుతంత్రాలతో తమ దేశానికి పట్టిన పీడను వదిలిస్తానని శపధం చేసాడు. కానీ 2013 రంజాన్ మాసం సమయంలో అతని కుటుంబ సభ్యులు అయిన 18 మందిని దారుణంగా హతమార్చారు. ఆ దాడిలో తృటిలో ముజాహిద్ తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు.తన కళ్ల ముందే తన పిల్లలు చేసిన ఆర్తనాదాలు ముజాహిద్ మర్చిపోలేదు.ఆ గాయాలింకా పచ్చిగా అతని గుండెను మండేలా చేస్తున్నాయి.

తనకు తన దేశానికి తీరని ద్రోహం చేసిన ఇస్లామిక్ స్టేట్ కు పాకిస్థాన్ కు బుద్ధి చెప్పటమే ధ్యేయంగా సాగుతుంటాడు. అఫ్గానిస్తాన్ లోని కొన్ని జిల్లాల్లో ఐఎస్ పట్టు సాధించిన నేపథ్యంలో ఆ మూకల్ని తరిమి తరిమి కొట్టేందుకు అతగాడు ఇప్పుడు విపరీతంగా కష్టపడుతున్నాడు. తన దళాలతో కలిసి తాను నేరుగా బరిలోకి దిగటమే కాదు ఇస్లామిక్ ఉగ్రవాదుల గుండెల్లో బెదురు పుట్టేలా చేసే ముజాహిద్ పుణ్యమా అని అఫ్ఘానిస్తాన్ తూర్పు ప్రాంతంలోని పలు ప్రాంతాలు ఐఎస్ పట్టు సడులుతోంది. ప్రస్తుతం అచిన్ జిల్లా గవర్నర్ గా పని చేస్తున్నా ఆయన ఉదయం ప్రజా సమస్యల్ని పరిష్కరించటం మధ్యాహ్నం నుంచి తుపాకీ పట్టుకొని నేరుగా కదనరంగంలోకి దూకి ఐఎస్ మూకల్ని ఏరి పారేసే పనిలో ఉంటారు. ఇప్పుడు ముజాహిద్ కు తోడుగా అఫ్ఘన్ సేనలే కాదు అమెరికా దళాలు జత కలిశాయి.తన చేత ఏకే 47 రైఫిల్ పట్టుకొని కదనరంగంలోకి దూకాడటంటే అఫ్ఘన్ సైనికులే కాదు,అమెరికన్ సైనికులకు పెద్ద అండగా భావిస్తుంటారు.

(Visited 74 times, 1 visits today)