Home / Entertainment / ‘డిక్టేటర్’ కి ముమైత్ ఖాన్ ఫిక్స్!

‘డిక్టేటర్’ కి ముమైత్ ఖాన్ ఫిక్స్!

Author:

Mumaith Khan In Balakrishna Dictator Movie

నందమూరి నట సింహం బాలకృష్ణ చేస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’.తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథలను ఎంచుకోవడం బాలయ్య స్పెషల్. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న సినిమాలో ఇంకా కేవలం ఒకే ఒక్క సాంగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఎనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలయ్య లుక్తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాను, అదే స్ధాయిలో సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మరో వార్త ఈ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. అది కూడా ఓ ఐటెం సాంగ్ కావడం విశేషం. తమన్ ఓ సూపర్బ్ ఐటెం సాంగ్ ని కూడా కంపోజ్ చేసాడు. ఈ ఐటెం సాంగ్ కోసం మొదటి నుంచి పలువురిని అప్రోచ్ అవుతూ వచ్చారు. ఇలియానా, నయనతార, శ్రద్ధ దాస్ ఇలా చాలా మందినే అనుకున్నారు.

కానీ ఫైనల్ గా ఈ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ మాత్రం ‘ఇప్పటికింకా నా వయసు’ అంటూ ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో నిలిచిన హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ కి దక్కింది. రీసెంట్ గా ఈ చిత్ర టీం ముమైత్ ఖాన్ కి ఆఫర్ ఇవ్వడం, తను కూడా ఓకే చెప్పడంతో సాంగ్ షూట్ కి సిద్దమవుతున్నారు. రేపటి నుంచి అనగా డిసెంబర్ 23 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్లో షూట్ చేయనున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో పంచ్ డైలాగులు నా దగ్గర వద్దంటూ చెప్పే డైలాగ్స్ భాగా పేలాయి. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

(Visited 94 times, 1 visits today)