Home / Inspiring Stories / సర్టిఫికేట్స్ లేవని IIT రిజెక్ట్ చేస్తే, ఈ అమ్మాయి టాలెంట్ తో MITలో సీటు సాధించింది.

సర్టిఫికేట్స్ లేవని IIT రిజెక్ట్ చేస్తే, ఈ అమ్మాయి టాలెంట్ తో MITలో సీటు సాధించింది.

Author:

బడి ఒకప్పుడు చదువుతో పాటు జీవిత పాఠం కూడా నేర్పేది కాని రోజులు మారాయి ఇప్పుడు చదువు అంటే కిలోల కొద్ది పుస్తకాలు, రంగు రంగుల యూనిఫార్ములు, హోంవర్క్ ఇవే నేటి బడి పిల్లల బ్రతుకులు అయ్యాయి. తల్లితండ్రుల అశయాలను మోస్తూ నేటి బడిపిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తన కూతురికి ఈ ఒత్తిడి ఉండకూడదని భావించింది ముంబాయి కి చెందిన సుప్రియ. అందరూ అవహేళన చేస్తున్నా పట్టించుకోకుండా ఏడవ తరగతి చదువుతున్న తన కూతురు మాల్విక ని స్కూల్ మానిపించి ఇంటినే ఒక క్లాసురూము లాగ మార్చింది. మూస పద్దతిలో కాకుండా జీవితానికి పనికొచ్చే మరియు మాల్వికకు ఇష్టమున్న సబ్జెక్టులతో టైం టేబుల్ తయారు చేసింది. హోంవర్క్, ర్యాంకుల గోల లేకపోవడంతో మాల్విక కూడా ఎటువంటి వత్తిడి లేకుండా అన్ని ప్రశాంతంగా నేర్చుకుంది. చాల పుస్తకాలు చదివిన మాల్వికకి కంప్యూటర్ ప్రొగ్రామింగ్ అంతే చాల ఇష్టం, స్వతహాగ నేర్చుకోవడంతో పాటు పలు కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఒలంపీయాడ్సుల్లో పాల్గోని మొదటి బహుమతులు సాధించింది. ఇంత టాలెంట్ ఉన్న మాల్విక ఉన్నత చదువులు IIT లో చదవాలనుకుంది. కాని చదువుకోవాలన్న ఆకాంక్ష, టాలెంట్ కన్న సర్టిఫికెట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మన IIT వారు ఆ అమ్మాయికి 10, 12 క్లాసు  సర్టిఫికెట్లు లేవు అని కారణం చెప్పి ఆ అమ్మాయికి సీటు ఇవ్వలేదు.

Unschooled-Mumbai-Girl-Gets-Admission-Into-MIT

వారి నిర్ణయంతో ఏమాత్రం కలత చెందని మాల్విక మన ప్రఖ్యాత యూనివర్సిటి, ప్రపంచంలోనే మొదటి ర్యాంకు గల మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి అప్లై చేసింది.  చదువుకోవాలన్న మాల్విక ఆకాంక్ష, ఒలంపీయాడ్సులో మాల్విక ప్రతిభ గుర్తించిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు స్కాలర్షిప్ ఇచ్చి మరి మాల్విక ఉన్నత చదువులు చదవడానికి సీటు ఇచ్చారు. ప్రతిభను గుర్తించకుండ ఒక మంచి అణిముత్యాన్ని విదేశాలకు వెళ్ళేల చేసిన మన IIT వారు మరొకసారి తమ రూల్స్ సడలిస్తే బాగుంటుంది. అలాగే తనపై, తన ప్రతిభపై నమ్మకం ఉంచుకొని చివరికి ప్రఖ్యాత MIT లో సీటు సాధించిన మాల్విక కు అభినందనలు. పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా మంచి వాతావరణం కలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించింది మాల్విక…అలాగే పిల్లలకు ఎలాంటి వాతావరణం కావాలో దగ్గర ఉండి మరి సమకూర్చి తన కూతురు విజయంలో ముఖ్యమైన పాత్ర వహించింది తల్లి సుప్రియ.

(Visited 154 times, 1 visits today)