Home / Inspiring Stories / నరకం లోనూ ఆనందాన్ని సృష్టించేవాడే ఇండియన్

నరకం లోనూ ఆనందాన్ని సృష్టించేవాడే ఇండియన్

Author:

Mumbai traffic dance

నగరం లో ప్రయాణం అంటేనే ట్రాఫిక్ జాం. కొన్నిసార్లు గంటలకొద్దీ రోడ్డుమీదే ఉండిపోవాల్సిన పరిస్థితి.నగరాల్లో నివసించే 40% మందికి మానసిక ఒత్తిడి కారణాల్లో ట్రాఫిక్ జాం కూడా ఒకటి. హైదరాబాద్, డిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో ట్రాఫిక్ అంటేనే జాం అన్నంతగా అలవాటు పడిపోయాం. హార్న్లూ, వాహనాలపొగా, చిరాకూ ట్రాఫిక్ జాం అంటేనే నరకం కదా..! ఐతే ఆ నరకం లోనూ ఆనందం గా ఉండేందుకు ఒక ముంబైకర్ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఈమధ్య ఇలాగే పేద్ద ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయిన ముంబై వాలా ఒకరు. ఆ నరకం లోనుంచి కొద్దిసేపైనా ఉపశమనం పొందాలనుకున్నాడు. ఇంకేం కారు స్టీరియో లో హిందీ పాటలు పెట్టి ఫుల్ల్ సౌండ్ పెంచేసాడు తరవాత ఫుట్ పాత్ మీదకొచ్చి డాన్స్ చేయటం మొదలు పెట్టాడు అంతే చుట్టూ ఉన్న వాహన దారులూ ఆయన తో చేరిపోయి ఆడటం మొదలుపెట్టేసారు. కొద్దిక్షణాల్లోనే అక్కడ నవ్వులూ కేరింతలూ అసలు ట్రాఫిక్ ఇంకా కాసేపు ఉండి ఉంటే బావుండు అనేంతగా మారిపోయింది అక్కడి వాతావరణం. ఆసన్ని వేశాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు అంతే రెండురోజుల్లో వైరల్ గా మారిపోయిందిది..

(Visited 1,789 times, 1 visits today)