Home / Entertainment / నా సినిమాలో ఇద్దరు మహేష్ లు కాదు ఒక్కడే – మురుగదాస్

నా సినిమాలో ఇద్దరు మహేష్ లు కాదు ఒక్కడే – మురుగదాస్

Author:

Mahesh Babu Murugadas Movie

టాలీవుడ్ సుపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రమ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో ఉంది. ఈ చిత్రంలో సమంత, కాజల్, ప్రణీతలతో మహేష్ ఆడిపాడనున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దిని తర్వాత మహేష్ బాబు,తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ కలయికలో త్వరలో తెరకేక్కబోతున్న చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై దర్శకుడు మురుగదాస్ అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చాడు. తనతో మహేష్ చేయబోయే చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటించడం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపాడు.

ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి కథని సిద్ధం చేసుకున్న మురుగదాస్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో సెట్స్ పైనకి తీసుకెళ్ళనున్నాడు. మురుగదాస్,మహేష్ ల కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి చట్టంతో పోరాటం, చట్టానికి కళ్ళు లేవు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇక దాదాపుగా 110కోట్ల బడ్జెట్ తో తెరకేక్కబోతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు 25కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

(Visited 177 times, 1 visits today)