Home / Entertainment / మురికి వాడపిల్లగా సమంతా.

మురికి వాడపిల్లగా సమంతా.

Author:

Samantha as slum girls

నటనకు స్కోప్ లేని పాత్రలే అయితే ఇంక నటించటం మానేస్తా అని ఆమధ్య తెగేసి చెప్పిన సమంత కి రెస్పాన్స్ వచ్చింది. తమిళ దర్శకుడు వెట్టిమారన్ తన కొత్త సినిమా “వాడా” లో సమంతా కి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ పాత్ర మురికి వాడ కు చెందిన అమ్మాయి పాత్రట. సమంత ఇప్పుడు దక్షిణాది టాప్ హీరోయిన్ లలో ఒకరు ఇప్పటికే సమంత దక్షిణాదిన టాప్ హీరోలతో నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. హిట్ లు ఎన్నొ ఉనా గానీ సమంత కి ఏం మాయ చేసావే వంటి ఒకటీ రెండూ స్నిమాలో తప్ప పెద్దగా నటన ని చూపించే పాత్రలేమీ లేవు.ఇప్పటి దాకా ఎక్కువగా తన గ్లామర్ తోనే నెట్టుకొచ్చింది సమంతా. ఐతే ఇందులో పూర్తిగా సమంత చేసుకున్న తప్పుఏమీ లేదు.. ఇప్పటివరకు నటనకు అవకాశం ఉన్న సరైన పాత్ర రాకపోవడం, నటించిన సినిమాల్లో రిచ్ గా, గ్లామరస్ గా కనిపించడం కూడా అందుకు ఒక కారణం అని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు సమంతా “వాడా” తో తన రూటు మార్చబోతోందంటున్నారు. సినిమాల్లోనే కాదు బయటకూడా సేవా కార్యక్రమాల దిశగా కూడా ఆమే తన దృష్టి పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఆమెది జాలి గుండె మాత్ర‌మేన‌ని అంతా అనుకున్నారు. కానీ మ‌రీ ఇంత జాలి హృద‌యం అని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. స‌మంత అవ‌య‌వ‌దానం చేయ‌డానికి ముంద‌కు వ‌స్తుంద‌న్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో అంద‌ర్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. ప్ర‌త్యూష ఫౌండేష‌న్ పేరిట పేద చిన్నారుల‌కు ఇప్ప‌టికే ఆమె కొండంత అండ‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు అవ‌య‌వ‌దానం కూడా చేయ‌డానికి ముంద‌కు రావ‌డంతో ఆమెని అంద‌రు ప్ర‌శంసిస్తున్నారు.

అవ‌య‌వ‌దానం చేసి మ‌రొక‌రి ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో త్వ‌ర‌లో ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్ట‌బోతున్నారు స‌మంత‌. అందులో భాగంగానే ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.మామూలు పాత్రలు చేసి నటిగా,రోతీన్ జీవితం తో మనిష్గా విసిగిపోయిన సమంతా నెమ్మదిగా తనకు నచ్చిన పనులూ,నచ్చిన పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగం గానే విమర్శకులను మెప్పించడానికి సమంత త్వరలో తమిళ దర్శకుడు వెట్టిమారన్ తీయబోతున్న ‘వాడా’ చెన్నై సినిమాలో డిగ్లామరస్ రోల్ చేసేందుకు ఒప్పుకుందట. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా, సమంత మురికివాడకు చెందిన అమ్మాయి క్యారెక్టర్ లో కనిపిస్తుందట. మరి ఇప్పటివరకు తన స్టైల్, గ్లామర్ తో ఆకట్టుకున్న సమంత ఇప్పుడు మురికివాడకు చెందిన అమ్మాయిగా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే సమంత అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా చూడాలి.

(Visited 96 times, 1 visits today)