Home / Inspiring Stories / స్నేహం కోసం తన ప్రాణాలే వదిలి..ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.

స్నేహం కోసం తన ప్రాణాలే వదిలి..ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.

Author:

ఒకవైపు మృత్యువు తన కంటి ముందే నాట్యం చేస్తుంది, బ్రతికేందుకు చక్కని అవకాశం ఉంది. అయినా, తన స్నేహితుల చేయి వదలలేదు. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కి చెందిన 20 సంవత్సరాల యువకుడు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ప్రపంచం మొత్తం తనకి నీరాజనం పలుకుతుంది.

bangladesh-student-refused-to-leave-besieged-dhaka-cafe-so-he-could-stay-with-friends

ఫరాజ్ అయాజ్ హుస్సేన్ అమెరికాలోని అట్లాంటాలోగల ఎమోరి యూనివర్సిటీలో చదువుతున్నాడు. తనతో పాటే, అదే యూనివర్సిటీలో చదువుతున్న మన భారతీయురాలైన తారుషి జైన్ మరియు అమెరికా జాతీయురాలైన అబింతా కబీర్ లతో తనకు స్నేహం ఏర్పడింది. సెలవులకి ఫరాజ్ తన సొంత దేశం అయినా బంగ్లాదేశ్ వెళ్లి తన మిత్రులైన తారుషి, కబీర్ లను ఆహ్వానించగా వారు కూడా తన ఆహ్వానం మేరకు బంగ్లా వెళ్లారు. వీరు ముగ్గురు బంగ్లాదేశ్ లో జరిగిన ఉగ్రదాడి సమయంలో రెస్టారెంట్ లోనే ఉన్నారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్ దేశ ప్రజలని అక్కడికి వెళ్లిపొమ్మని ఆదేశించినా… తన స్నేహితులని వదిలి వెళ్లానని ఫరాజ్ ఖరాఖండిగా చెప్పేశాడు. మానవత్వం అంటే ఎంతో తెలియని కర్కశులైన ఆ ఉగ్రవాదులకు స్నేహం విలువ ఎలా అర్ధం అవుతుంది… తారుషి, కబీర్ లతో సహా అతడిని కూడా వారు హతమార్చడం జరిగింది. సోమవారం తారుషి మృతదేహం మన దేశానికి చేరుకున్నది. తనకి గుర్గావ్ లో అంత్యక్రియలు నిర్వహించారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన స్నేహితుల కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన వారిని కాపాడాలని చూసిన ఫరాజ్ కు ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది.

Must Read: అమాయక అమ్మాయి ప్రాణం తీసిన ఫేస్ బుక్ పోస్ట్.

(Visited 6,326 times, 1 visits today)