Home / Inspiring Stories / నీటిని సరిగ్గా వినియోగించుకుందాం…మన తరతరాలను రక్షించుకుందాం

నీటిని సరిగ్గా వినియోగించుకుందాం…మన తరతరాలను రక్షించుకుందాం

Author:

tap water not flowing

మనిషి బ్రతకడానికి ముఖ్యంగా కావలసినవి గాలి, నీరు, ఆహారం. ఈ మూడు ఉంటే మనిషి హాయిగా బ్రతకవచ్చు. ఏ ప్రాణికైనా నీరు లేనిదే మనుగడ సాధ్యం కాదు. మిగతా జీవులతో పోలిస్తే మనిషికి నీటి అవసరం మరింత ఎక్కువ. ఇప్పటికే చాలావరకు గాలి కలుషితమైపోయింది. చాలా దేశాల్లో ప్రజలు ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. ఇక ఇప్పుడు నీటి వంతు. ఒక ప్రాంతం పచ్చగా కలకలాడుతూ, కరువు కాటాకలు లేకుండ అక్కడి ప్రజలు సుఖ సంతోషలతో జీవిస్తూ ఉన్నారంటే అక్కడ సమృద్దిగా నీరు ఉన్నట్టే.

     భూభాగంలో 70శాతం నీరు ఉంది. ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్పభాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే పరిశుభ్రమైన నీటిలో 1శాతం కంటే తక్కువ నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన అవసరం. కానీ ఇప్పటికీ 88.4 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

               మనం స్నానం చేయడానికి 20 లీటర్ల నీరు సరిపోతుంది. కానీ మనోళ్లు 90 లీటర్ల కంటే ఎక్కువగా నీటిని వాడుతుంటారు. ఫలితంగా ఒక వ్యక్తి సగటున రోజుకు 70 లీటర్లకుపైగా నీరు వృథా చేస్తున్నాడు. ఒక మనిషి నీరు సగటున ఎంతవాడాలో మనం దానికి రెట్టింపు స్థాయిలో నీటిని వాడుతున్నాం. ఇక చౌరస్తాలో నల్లా ఉంటుంది, అస్తమానం నల్లా నుంచి నీరు వస్తూ వృథాగా పోతుంటుంది. కానీ ఎవరూ దాన్ని కట్టివేయరు. ఏదైనా ఫంక్షన్ జరిగితే వేలకొద్ది లీటర్ల నీరు నేలపాలవుతుంది. నీటికోసం ఇప్పటికే చాలాచోట్ల జనం కన్నీళ్లు పెడుతున్నారు. మున్ముందు మంచినీటి కోసం యుద్ధాలు వచ్చినా ఆశ్చర్యం లేదు.. ఆధునిక భారతంలో నదీజలాల కోసం జరిగే వివాదాలు ఎరుగని వారెవ్వరు? భూగోళంలో మంచినీటి అవసరాలు, సౌకర్యాలు, వనరుల మధ్య పెరిగిపోయిన అంతరమే ఈ దుస్థితికి కారణం. ఈ దురావస్థకు కారణం మనమే. అందుకే పరిస్థితిని చక్కదిద్దుకోవలసినది కూడా మనమే.

india people troubling foe water

            ఎందుకంటే పండించే పంటల నుండి వండి వడ్డించే పదార్థాల వరకూ నీరు లేకుండా ఏదీ సాధ్యం కాదు. సగటున ఒక హామ్‌బర్గర్ తయారీకి 2,400 లీటర్ల నీరు వినియోగిస్తారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఒక కిలో గోధుమల ఉత్పత్తికి 500 నుంచి 4000 లీటర్ల నీరు ఖర్చవుతాయని తెలుసా? ఒక కిలో చాక్లెట్ తయారీకి 822 లీటర్ల నీళ్లు అవసరం. కేజీ అరటిపళ్ల ఉత్పత్తికి 790 లీటర్ల నీరు వినియోగమవుతుంది. కిలో బియ్యం పండించాలంటే 2497 లీటర్ల నీరు వాడాలి. 1250 గ్రాముల పత్తి ఉత్పత్తికి 2495 లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక బ్రెడ్ తయారీకి 1608 లీటర్లు, ఒక పిజ్జా తయారీకి 1230 లీటర్ల నీరు సగటున వినియోగిస్తారంటే నీటి అవసరాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

మన ఇళ్ళల్లో డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టేస్తున్నారు, అని మనకు ఇంట్లో పెద్దలు హెచ్చరిస్తూంటారు. కానీ రానున్న రోజుల్లో మనం నీటిని ఇలాగే వృదా చేస్తే డబ్బులు పెట్టిన నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నీటిని మనం వృదా చేయాకుండ ఉండలాంటే కొన్ని విషయాలను మనం పాటించాలి.

Klara Farkas fetches water from an outdoor tap in Gyöngyöspata. The village of Gyöngyöspata in Hungary has seen some tense periods of confrontation between the Roma and local right wing population.

.ఎక్కువ సేపు స్నానం చేయకుండా ఉండటం వలన తక్కువ నీళ్ళను వృధా చేయగలుగుతాం.
.మొహం కడిగే టప్పుడు, బ్రష్ చేసే టప్పుడు నల్లా నీళ్ళను అలానే వదిలేయకుండా ..అవసరం ఉన్నపుడే ఉపయోగించుకోవడం.
.వృధా గా వచ్చే ఎయిర్ కూలర్ వాటర్ ను చెట్లకు పోయండి… అవి మనన్ని కాపాడుతాయి.

” నీటిని సరిగ్గా వినియోగించుకుందాం…మన తరతరాలను రక్షించుకుందాం”.

(Visited 316 times, 1 visits today)