Home / Videos / మానసీ నిద్రలేమ్మా…!

మానసీ నిద్రలేమ్మా…!


పిల్లల అమాయకత్వం నవ్విస్తుంది వాళ్ల చిన్నారి మొహం లో కోపం, అలసట కూడా అందం గానే ఉంటాయి. ఈ వీడియోలో చిన్నారిని చూడండి వచ్చే నిద్రని ఆపలేక మేలుకొని ఉండలేక ఆ బుజ్జి తల్లి ఎన్ని ఆపసోపాలు పడిందో చూదండి. చూస్తున్నంత సేపూ నవ్వుతో పాటూ.. పిల్లలపై మనం చదువుల పేరు తో వేసే భారం ఆ పసి వాళ్ళని ఎంత భాద పెడుతుందో అర్థమౌతుంది. రెండూ మూడేళ్ళ చిన్నారులనూ వారి భవిశ్యత్తు కోసమే అంటూ బాల్యం అనే తీపిగుర్తులను మిగల్చకుండా వారిని ర్యాంకుల రేసులోకి తోసి ఆ పసిమనసులని ఎంత బాధ పెడుతున్నామో కదా అనిపిస్తోంది.

టీచర్ లేపుతున్నా తన నిద్రనాపుకోలేక చేసే విన్యాసాలు ఎంత క్యూట్ గా ఉన్నాయో మీరే చూడండి. పక్కనున్న సిసింద్రీల నవ్వులు కూడా మిమ్మల్ని నవ్విస్తాయ్.డిల్లి లోని ఒక స్కూల్ లో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరీ పాపులర్ అయింది. షేర్ చేసుకుని మరీ మానసి నిద్రని చూసేస్తున్నారు….

(Visited 53 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]