Home / Inspiring Stories / అనంత పద్మనాభుని చుట్టూ అంతు చిక్కని రహస్యాలు – నాగబంద ప్రభావం ఆరోగదికి ముందే మొదలయ్యిందా???

అనంత పద్మనాభుని చుట్టూ అంతు చిక్కని రహస్యాలు – నాగబంద ప్రభావం ఆరోగదికి ముందే మొదలయ్యిందా???

Author:

కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.అద్భుతమైన శిల్ప సంపదకు, అచ్చెరువొందించే స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులై భక్తులు ఆలయ దర్శనానికి ప్రపంచం నలు మూలల నుంచీ సందర్శకులు వస్తూనే ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి నేలమాళిగల్లో బయట పడ్డ అనంత సంపదకు ప్రపంచమంతా నిశ్చేష్టమైంది. ఎన్నో రోజులు వార్తల్లో అదే ముఖ్యాంశమై నిలిచింది. ఆలయ నేలమాళిగల్లో బయటపడ్డ బంగారు ఆభరణాలు, వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు, వింత వస్తువులు అందరినీ అబ్బురపరిచాయి.

AnanthaPadmanabha Temple

కానీ ఆలయ చివరి నేలమాళిగ ద్వారాన్ని మాత్రం తెరవడం ఎవరి వల్లా సాధ్యం కాలేదు. వాటిని తెరిచే ప్రయత్నం చేసిన అధికారులు విచిత్ర కారణాలతో మరణించడం, ఆ ద్వారం తెరవలేక పోవడం జరుగుతోంది. చివరికి సుప్రీం కోర్టు ఆ ద్వారం తెరవకూడదనే ఆదేశాలనిచ్చింది. ఎందుకని ఇప్పటికీ ఆ ఆరవ నేలమాళిగ ద్వారం రహస్యాన్ని ఎవరూ ఛేదించలేక పోయారు.? నిజంగా మనకందని శక్తులు ఆ ద్వారాన్ని తెరవకుండా కాపలా ఉన్నాయా? ఎన్ని రహస్యాలు ఆ ఆలయం చుట్టూ ఉన్నాయి? అసలు అన్ని కోట్ల రూపాయల సంపద అక్కడికి ఎలా చేరింది? అన్న విశయాలను ఒక సారి చూస్తే….

AnanthaPadmanabha Temple

పద్నాలుగు, పదిహేను శతాబ్ధాలకాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతొ సుగందద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చి చేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు.ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చివారినుంచి, బ్రిటిష్ వారినుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో బద్రపరిచారు. అదే ఇప్పుడు బయటపడిన బంగారు నిథి. అయితే ఆ తెరవబడని ఆరవ గదిలో మరింత విలువైన నిథి ఉందట కానీ అది తెరిస్తే మాత్రం పెను ముప్పు తప్పదు అనే మాటలూ వినిపిస్తున్నాయి ….

కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి….

నాగబంధం అన్నది మొత్తం నిధినిక్షేపాలకు వర్తిస్తుంది. కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. సంపద వెలుగుచూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది. మరొక సభ్యునికి కాలు విరిగింది. ఐదు గదులను తెరిచిన తరువాత ఆరోగదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే, ఆ గది తలుపులపై నాగపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు. ఇందుకు పరాకాష్టగా నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్నుమూశారు. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదన్నది స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం. ఈలోగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆరోగది విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబ్తున్నారు.

AnanthaPadmanabha swamy temple

ఆపార నిధినిక్షేపాలు ఐదు గదుల్లో ఉండగా, కేవలం ఆరో గదికే నాగబంధం వేశారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన మనుషులు చెప్తున్నారు. నాగబంధం ఒకసారి వేస్తే, అది వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది. ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధినిక్షేపాలను కాపాడుతుంటాయి. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉన్నది. ఇది మొత్తం నిధినిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ, కేవలం ఆరోగదికి మాత్రమే పరిమితమైనది కాదు. అందుకే, నిధినిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది. అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరి ఆరోగది తలుపులు తెరిస్తే కొత్తగా వచ్చే నష్టం ఉంటుందా అన్న ప్రశ్న వినవచ్చే సమాధానం…. “ఆరోగది తలుపులు ఇప్పుడు తెరిచినా, తెరవకపోయినా జరగాల్సిన కీడు జరగడం మొదలైంది. కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు., అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకోవచ్చు. మరిన్నిదారుణాలు జరగవచ్చు. తాంత్రిక శాస్త్ర పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చుకదా అంటే ఆ పని ముందే చేయాల్సింది. అంటే, మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధినిక్షేపాలను విముక్తి చేసిన తరువాత గది తలుపులు తెరిస్తే బాగుండేది. అంటూ కొందరు మళయాలీ తాంత్రికులు చెప్పిన సమాధానం అట….

ఏది నిజమో ఏది కల్పనో ఏమీ చెప్పలేని స్తితిలో అంతా నిశ్శబ్దంగానే ఉన్నారు… మరి ఈ అనంత నాథుని రహస్యాన్ని ఏవరు కనుగొంటారో ఇప్పటికి మాత్రం ఆ ఆరో గది…. ఒక మిస్టరీనే…

(Visited 7,264 times, 1 visits today)