Home / Entertainment / అప్పుడు అన్నమయ్య..! ఇప్పుడు హాథీరాం బాబా..!

అప్పుడు అన్నమయ్య..! ఇప్పుడు హాథీరాం బాబా..!

Author:

ఎప్పటి నుంచో అనుకున్నట్లుగానే రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నాగార్జున మరొక భక్తి సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే, వీరిద్దరి కలయికలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి లాంటి అద్భుతమైన భక్తి సినిమాలు వచ్చాయి. మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే భక్తిరస చిత్రానికి ‘ఓం నమో వెంకటేశాయ’ అనే పేరుని టైటిల్ గా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఖరారు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున లు కలిసి సినిమా పేరుని ప్రకటించారు. ఈ సినిమాని వెంకటేశ్వర స్వామి భక్తుడైన హథీంరాం బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నాం అని, అందులో హథీంరాం బాబా పాత్రని తాను పోషించబోతున్నట్లు నాగార్జున తెలిపాడు.

Nagarjuna-New-Look-As-Baba-Hathi-Ram

నాగార్జున “మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి” సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన తరువాత ఇలాంటి భక్తి సినిమా చేయడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా కోసం నాగార్జున చాలా రోజుల నుండి గడ్డం పెంచాడు, హథీంరాం బాబాకి సంబంధించిన వివిధ ప్రాంతాలకి కూడా వెళ్లి వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25 వ తేదీన మొదలవుతుంది, అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అద్భుతంగా నటించి చరిత్ర సృష్టించిన నాగార్జున మరోసారి కూడా శ్రీవారి భక్తుడిగానే నటిస్తుండడం విశేషం. విభిన్న సినిమాలతో దూసుకెళ్తున్న నాగార్జున ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుందాం.

(Visited 571 times, 1 visits today)