Home / Uncategorized / నమో వెంకటేశాయ పాటలు మరియు సినిమా విడుదల తేదీలు ఇవే…

నమో వెంకటేశాయ పాటలు మరియు సినిమా విడుదల తేదీలు ఇవే…

Author:

భక్తి రస చిత్రాలకు పెట్టింది పేరుగా దూసుకెళ్తున్నారు అక్కినేని నాగార్జున. గతంలో దర్శకేంద్రుడు రాఘువేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి వంటి విజయవంతమైన భక్తి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించిన నాగార్జున, ఇప్పుడు మరో భక్తి చిత్రం లో నటిస్తున్నాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న చిత్రం యొక్క పేరు “నమో వెంకటేశాయ”, ఈ చిత్రానికి కూడా దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇరువురి కలయికలో వచ్చిన అన్ని భక్తి చిత్రాలు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.

namo venkatesaya audio and movie release dates

వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన హతి రామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తీయబడుతోంది. ఈ భక్తి చిత్రం కోసం, నాగార్జున తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు. ఈ చిత్రంలో అనుష్క ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ప్రజ్ఞా జైస్వాల్, విమల రామన్ ప్రధాన భూమిక పోషించనున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం యొక్క పాటలు ఈ నెల 24 విడుదల అవుతుండగా, చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలియజేసారు.

(Visited 432 times, 1 visits today)