Home / Inspiring Stories / రైతు ఆత్మహత్యలను ఆపడం కోసం నానా చేసిన పని మన తెలుగు హీరోలు చేయలేరా..?

రైతు ఆత్మహత్యలను ఆపడం కోసం నానా చేసిన పని మన తెలుగు హీరోలు చేయలేరా..?

Author:

హీరో అంటే సినిమాలో అమ్మాయి పక్కన స్టెప్పులు వేసినంతమాత్రాన లేదంటే తెరమీద ఫైట్లు చేసినంత మాత్రాన ఎవరూ హీరో కాలేరు. హీరో అంటే నిజజీవితం లో పోరాడాలి,నిజంగా సాధించాలి.. తన వారికోసం తానంతట తానుగా ముందునిలవాలి అతనే నిజమైన హీరో… అతనే నానా పటేకర్… ఔను ఇప్పుడు నానా పటేకర్ మహారాష్ట్ర రైతుల పాలిట రియల్ హీరో. రైతు ఆత్మహత్యల మీద మొట్టమొదటగా స్పందించిన మనిషి,వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళను ను పంచుకున్న మనిషి. మహారాష్ట్ర రైతుల ఆత్మ హత్యలను ఆపేందుకు పోరాడుతున్న నిజమైన హీరో నానాపటేకర్…

Nana Patekar

మరాఠ్వాడలో నెలకొన్న కరువు పరిస్థితులపై నానా చొరవ తీసుకుని రైతులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరికొందరు బాలీవుడ్, మరాఠీ చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారు కూడా రైతులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నానా పటేకర్,మరాఠీ నటుడు మకరంద్ అనాస్‌పురె కలిసి స్థాపించిన “నామ్” సంస్థ మరాఠ్వాడలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి మరో అడుగు ముందుకేసింది.‘రైతులు తమ ప్రాణాలు తామే తీసుకోగల్గినప్పుడు ఇతరుల ప్రాణాలూ తీయగలరు. విప్లవ ఆలోచన సాగితే రైతులు నక్సలైట్లు కాగలరు’ అని రైతుల కోసం తన కార్యకలాపాలను మొదలు పెట్టే రోజున వ్యాఖ్యానించారు.ఇప్పుడు తనకు మద్దతుగా ఈ ప్రభుత్వాలు వచ్చినా రాకున్నా. రైతుని చావనిచ్చేదే లేదంటున్నాడు. మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల 113 కుటుంబాలకు ఆయన ఇదివరలోనే రూ. 15వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు. ‘‘కరువు కళ్లెర్రజేసుకుని ఉరిమురిమి చూస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, శరద్‌ పవార్‌, నారాయణ్‌ రాణే వంటి నేతలు కలసికట్టుగా ముందుకు వచ్చి ఈ దుర్భర పరిస్థితిపై పోరు చేయాలి’’ అని నానా పటేకర్‌ అన్నారు. అయితే.. తానన్నట్టు వారంతా కలసి వస్తారా? లేదా? అన్నది తెలియదన్నారు. ఒకేఒక్క పార్టీ ఒంటరిగా పోరాడినంత మాత్రాన కరువు రక్కసిని పారదోలలేమన్నారు. ఎంతో మంది ప్రజలు వారికి తోచిన విధంగా సాయం చేశారని, తాము దానిని అందించే పోస్టుమెన్‌ మాత్రమేనని చెప్పారు. సమస్యకు లొంగిపోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు సూచించారు. పెన్ను, పుస్తకం, సబ్బుల్లాంటి అన్ని వస్తువులకూ తయారీదారులే ధరలు నిర్ధారిస్తారని, కానీ.. పంటకు, పాడి రైతు తీసే పాలకు మాత్రం ఆ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు…..

Nana Patekar Helping Formers 1

రాబోయే రోజుల్లో కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో రైతులకు సూచనలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే జల వనరులతో పాటు రైతుల కోసం కొన్ని ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నారు. రైతులతో భేటీ అవుతూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. నామ్ సంస్థకు మద్దతు తెలిపే వారి సంఖ్య పెరగడంతోపాటు వీరు తోడ్పాటు అందించే రైతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలిపారు.ఒక నటుడు తనని సినిమాల్లో చూసి హీరో అన్న జనం కోసం ఇంత చేసి నిజంగానే హీరో అయ్యాడు. మన తెలుగు పరిశ్రమలోని హీరోలు కూడా “నిజమైన హీరోలు ఎప్పుడు అవుతారో” ఎదురు చూడాలి మరి….

(Visited 415 times, 1 visits today)