Home / Entertainment / నేను బాలయ్య ఫ్యాన్ ని కాదు – నాని

నేను బాలయ్య ఫ్యాన్ ని కాదు – నాని

Author:

Krishnagadi Veera Prema Gadha

న్యాచురల్ స్టార్ నాని ‘భలే భలే మొగడివోయ్’ చిత్రం తర్వాత ‘అందాల రాక్షసి’ ఫేమ్ దర్శకుడు హను రాఘవాపుడి దర్శకత్వంలో హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’. నానికి జోడిగా నటిస్తున్న మెహ్రిన్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతుంది.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12 న విడుదలకి సిద్ధంగా ఉంది.

నేను నిజ జీవితంలో ‘కమల్ హసన్’ కి పెద్ద ఫ్యాన్.. ఇక తెలుగులో ఏ సినిమా నచ్చితే ఆ సినిమా హీరోకి అభిమానిని కానీ ఈ చిత్రంలో తాను బాలకృష్ణ అభిమానిగా నటిచడంతో పాటు తన చేతిపై ఉన్న టాటూతో సినిమా కథ మలుపు తిరుగుతుందని నాని తెలిపాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా సినిమా విజయంపై ధీమాగా ఉంది. మొదట ఈ సినిమాలో బాలయ్య అభిమానిగా నటిస్తుండటం బాలయ్యకి తెలిసి చాలా ఎక్సైట్ అయ్యాడని, నాకు తెలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని మొదటి రోజు చూస్తాడని అనుకుంటున్నట్లు నాని చెప్పుకొచ్చాడు.

(Visited 558 times, 1 visits today)