Home / Entertainment / ‘ధమాక’ కోసం కొడైకెనాల్ వెళ్ళనున్న నాని.

‘ధమాక’ కోసం కొడైకెనాల్ వెళ్ళనున్న నాని.

Author:

Nani

మొన్నటి వరకు నాని టాలెంట్ ఉన్న అదృష్టం కలిసి రాలేదు. కాని భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఒక్క సినిమాతో మనోడి జాతకం మారిపోయింది. ఇప్పుడు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో కెరీర్లో మరో బిగ్ హిట్ అందుకున్నడు. నాని ఇప్పుడు సక్సెస్ టూర్ బిజీగా ఉన్నాడు. సక్సెస్ టూర్ తర్వాత నాని తన తదుపరి సినిమా షూట్ కోసం కొడైకెనాల్ వెళ్ళనున్నాడు..

నాని తన నెక్స్ట్ సినిమా తనకి హీరోగా జన్మనిచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన నివేదిత థామస్, సురభి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘ధమాక’ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. ఇప్పటికే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఇప్పటివరకూ తెలుగులో రానటువంటి ఒక సరికొత్త జానర్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చెప్పారు.

(Visited 194 times, 1 visits today)