Home / Entertainment / నాని గాడి వీర ప్రేమ గాథ కథకు జై బాలయ్య కాదంట!

నాని గాడి వీర ప్రేమ గాథ కథకు జై బాలయ్య కాదంట!

Author:

Nani Jai Balayya Movie Title Confusion

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో యంగ్ హీరో నాని మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేశాడు. కథ‌ల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. సెల‌క్టివ్ గా త‌న బాడీ లాంగ్వేజ్ కు త‌గ్గ క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌లే రెండున్న‌ర కోట్ల నాని నాలుగు కోట్ల‌కు ప‌రిగెత్తుతున్నాడ‌ని క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నాని హను రాఘవపూడి దర్శకత్వం లో జై బాల‌య్య అనే సినిమాలో న‌టిస్తున్నాడు. వహిస్తున్నాడు. ఇందులో నాని న‌ట‌సింహ బాల‌కృష్ణ అభిమానిగా క‌నిపించ‌నున్నాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ జై బాల‌య్య అనే టైటిల్ జ‌నాల్లో బాగా పాపుల‌ర్ అయింది. కానీ ఎందుక‌నో ఇప్పుడు టైటిల్ ను మార్చాల‌ని టీమ్ భావిస్తోంద‌ట‌.

ఈ సినిమా ఆడియోని జనవరి 10న రిలీజ్ చేసి, సినిమాని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయనున్నారు. కానీ ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. ‘జై బాలయ్య’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరిపినా ఫైనల్ గా ఈ టైటిల్ పెట్టడం లేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. మొత్తానికి చిత్ర బృందం ఓ ఆకట్టుకునే, ఆసక్తిని రేకెత్తించే టైటిల్ తో ముందుకు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

(Visited 186 times, 1 visits today)