Home / Entertainment / నాని మజ్ను టీజర్‌ విడుదల.

నాని మజ్ను టీజర్‌ విడుదల.

Author:

ఇప్పుడున్న తెలుగు హీరోలలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాని. ఇంతకు ముందే జంటిల్ మెన్ అంటూ మన అందరిని పలకరించిన ఈ న్యాచురల్ హీరో ఇప్పుడు తన ప్రేమ కోసం మజ్ను గా మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు విరించి వర్మ ( ఉయ్యాలా జంపాల) ఫేమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మజ్ను సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో హీరో ట్రైన్ లో వెళ్తుంటే  ” ప్రేమ లేదని ప్రేమించరాదని ” వింటూ లవ్ ఫెయిల్యూర్ అయిన వాడిగా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో నాని సరసన అను ఇమ్మాన్యుయేల్‌ అనే హీరోయిన్ నటిస్తుంది. ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నాడు.సెప్టెంబరు 17న నాని మజ్నుగా మన ముందుకు రాబోతున్నాడు. దానికి ముందుగా ఒక్కసారి ఈ టీజర్‌ పై లుక్ వేయండి

(Visited 63 times, 1 visits today)